Thursday, May 16, 2024

నేడు టెన్త్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి శుక్రవారం వెలువడనున్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం, గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఎ) ఆధారంగా గ్రేడ్లను కేటాయించాలని నిర్ణయించింది. పదవ తరగతి ఫలితాల విడుదలకు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికారులు పంపిన ఫైల్‌పై మంత్రి సంతకం చేశారు. దాంతో పరీక్ష ఫీజు చెల్లించిన 5 లక్షల 21వేల 398 మంది ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. అయితే ఈసారి పదవ తరగతి పరీక్షలు లేకున్నా విద్యార్థులకు హాల్ టికెట్ నంబర్లను కేటాయించారు. మార్కుల మెమోలో హాల్‌టికెట్ నంబర్‌ను కూడా నమోదు చేస్తారు. కాగా, గత ఏడాది నాలుగు ఎఫ్‌ఎ పరీక్షల సగటు ఆధారంగా టెన్త్ ఫలితాలు ప్రకటించగా, ఈసారి మాత్రం ఒక్క ఎఫ్‌ఎ ఆధారంగానే వార్షిక పరీక్ష మార్కులు కేటాయించనున్నారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత నెలాఖరులోగా మెమోలు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

TS 10th Class Results to Released today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News