Monday, April 29, 2024

త్వరలో పిఆర్‌సి?

- Advertisement -
- Advertisement -

త్వరలోనే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఉద్యోగుల జీతభత్యాల సవరణ నిమిత్తం ప్రభుత్వం పిఆర్‌సిని నియమించే అవకాశాలు ఉ న్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులో దీనికోసం ప్రత్యే క కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టుగా సమాచారం. దీనికోసం రిటైర్డ్ ఐఎఎస్ నేతృత్వం లో పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్ర భుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. అందులో భాగంగా రాష్ట్రం ఏర్పాటు తరువాత రెండో పిఆర్ సిని అమలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అ వుతోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఉద్యోగ సం ఘాల నేతలతో సిఎం కెసిఆర్ కీలక సమావే శం నిర్వహించనున్నట్టుగా తెలిసింది. ప్రస్తుత వేత న సవరణ సంఘం (పిఆర్‌సి) గడువు జూన్ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కొ త్త పిఆర్‌సిని త్వరితగతిన ప్రకటించాలని ఉద్యోగు లు డిమాండ్ చేస్తున్నారు.

2018లో 27శాతం ఐఆర్
ముఖ్యంగా ఉద్యోగులు పలు డిమాండ్‌లతో ప్రభు త్వం ముందుకెళ్లాలని నిర్ణయించినట్టుగా తెలిసిం ది. అందులో ఐఆర్‌తో పాటు ఈహెచ్‌ఎస్ పథకం అమలు, ఉద్యోగులకుస్థలాలను కేటాయించడం, సిపిఎస్ రద్దు వంటి అంశాలు ఉన్నాయి. 2009 లో ఐఆర్ 11 శాతం ప్రకటించగా, 2014లో 15 శాతం, 2018లో 27శాతం ఐఆర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈసారి కూడా 30 శాతానికి పైగా ఐఆర్‌ను ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు వేరే రా ష్ట్రంలో ఇప్పటికే పిఆర్‌సి కమిషన్‌కు సంబంధించి నిర్ణయం తీసుకున్నాయని త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమ డిమాండ్‌లను నెరవేర్చాలని ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

జూలై నుంచి ఐఆర్ అమల్లోకి వచ్చేలా….
అయితే ఒకవేళ ఈ ఐఆర్‌ను ప్రభుత్వం ప్రకటించిన దానిని మాత్రం జూలై 01వ తేదీ నుంచి (2023) అమల్లోకి తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రస్తుతం వచ్చే సంవత్సరం మార్చిలో చాలామంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. దీంతోపాటు ఈహెచ్‌ఎస్ స్కీంకు సంబంధించి నెలకు ప్రతి ఉద్యోగి తన జీతం రూ.500లను కట్ చేయించుకుంటే ప్రభుత్వం కూడా అంతేమొత్తాన్ని ఈహెచ్‌ఎస్ స్కీం కింద జమచేస్తుంది. దీనివల్ల ప్రతి ఉద్యోగి రూ.10 లక్షల మేర ఇన్యూరెన్స్ వర్తించేలా చూడాలని ఉద్యోగులు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా ఈ విషయంలో కూడా ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది.

సిపిఎస్‌ను రద్దు చేసి….
20 సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చిన ఈ సిపిఎస్ పథకం వల్ల ప్రతి ఉద్యోగి 10 శాతం షేర్‌ను, ప్రభుత్వం 10 శాతం షేర్‌ను షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది. 20 సంవత్సరాలుగా ఉద్యోగి జీతం నుంచి కట్ అవుతున్న డబ్బులను కేంద్రం తిరిగి ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సిపిఎస్ పథకాన్ని రద్దు చేసి పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించడంతో ఇక్కడ కూడా దానిని అమల్లోకి తీసుకురావాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం బిఆర్‌ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పాత పెన్షన్‌ను మళ్లీ రాష్ట్రంలో పునరుద్ధరిస్తే బాగుంటుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో 30 శాతం ఫిట్‌మెంట్
గతంలో సవరించిన వేతన స్కేళ్ల అమల్లో దాదాపు రెండేళ్లు జాప్యం జరిగింది. ముందస్తు ఎన్నికలు జరిగితే కొత్త పీఆర్సీ ఏర్పాటుకు ఎన్నికల కోడ్ అడ్డు వస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం బిస్వాల్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. 2018లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలును సవరించాలని ఆ కమిటీ నివేదికను డిసెంబర్ 31, 2020న ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో సిఎం కెసిఆర్ మార్చి 22, 2021న ఉద్యోగులకు సవరించిన వేతన స్కేళ్లను ప్రకటించారు. ఏప్రిల్ 1, 2021 నుంచి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా 9.17 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాల పెంపును ప్రభుత్వం అందించింది.

నాలుగు డిమాండ్‌లతో ప్రభుత్వం ముందుకు
టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్
సిఎం కెసిఆర్ గతంలో ఉద్యోగులకు అనేక వరాలను ప్రకటించారు. ప్రస్తుతం పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరిస్తారన్న నమ్మకం మాకుంది. రెండు రోజుల క్రితం మంత్రులు హరీష్‌రావు, కెటిఆర్‌లను కలిసి తాము చేసిన విజ్ఞప్తులపై వారు సానుకూలంగా స్పందించారు. 33 శాఖల్లో 1600 మందికి సంబంధించి కారుణ్య నియామకాల గురించి కెటిఆర్‌కు తాము చేసిన వినతిపై వెంటనే ఆయన స్పందించి వారికి వెంటనే ఉద్యోగాలను కల్పించాలని, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేయాలని సిఎస్‌కు ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వానికి ఉద్యోగులపై ఉన్న శ్రద్ధను తెలియచేస్తోంది. ప్రస్తుతం సిఎం కెసిఆర్‌తో ఉద్యోగ సంఘాలతో సమావేశం ఉంటుందని ఆశిస్తున్నాం. అందులో భాగంగా ఉద్యోగులందరం కలిసి నాలుగు డిమాండ్‌లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాం. ముఖ్యంగా ఐఆర్ ప్రకటించడం, పిఆర్‌సి కమిషన్‌ను నియమించడం, ఈహెచ్‌ఎస్ పథకాన్ని ఉద్యోగులకు వర్తింపచేయడం దీంతోపాటు సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించడం లాంటి డిమాండ్‌లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News