Sunday, May 5, 2024

రూ.559 కోట్లు జమ

- Advertisement -
- Advertisement -

18.69లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.559 కోట్లు జమ

రైతుబంధు పంపిణీ షురూ.. ముందుగా ఎకరం రైతులకు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి చేదోడుగా ఉంటు న్న టీఆర్‌ఎస్ సర్కారు యాసంగి పంటల సాగు కు సంబంధించి పెట్టుబడిసాయం కింద నిధులు విడుదల చేసింది. రైతుబంధు పధకం కింద తొలివిడుతగా ఎకరం విస్తీర్ణం వున్న సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యత నిచ్చింది. ఎకరానికి రూ.5 వేల వంతున సోమవారం నాడు 18.69లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.559.99కోట్లు జమచేసింది.యాసంగి పంటల సాగు సీజన్‌లో రాష్ట్రమంతటా వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. రైతులు పంటల పెట్టుబడులకోసం ఎదురు చూస్తున్న పరిస్థితులను గమనించి ముఖ్యమంత్రి కేసీఆర్ సకాలం రైతుబంధు నిధులు విడుదల చేసి తమను ఆ దుకున్నారంటూ రైతుకుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వానకాలంలో పంటదిగుబడి ఆ శించిన రీతిలో వున్నప్పటికీ తగినంత ధరలు లేక అధికశాతం రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్లో విక్రయించకుండా నిల్వ ఉంచుకున్నారు. ఈపరిస్థితుల్లో తిరిగి యాసంగి పంటల సాగుకు పెట్టుబడులకోసం ఎరుదురు చూడాల్సివస్తోంది. రాష్ట్రంలో మొత్తం 61.49లక్షల మంది రైతులు వుండగా అందులో తొలివిడుతగా ఎకరం పొలం ఉన్న రైతులు పంటసాయం అందుకున్నారు. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే రైతుబంధు నిధులు అందచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

ఎకరం విస్తీర్ణం వుండి రైతుబంధు నిధులు అందుకున్న రైతుల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లా నుంచి మొత్తం 68,644 ఎకరాలకుగాను 1,05,548మంది రైతులు రూ.34,33,24,934 సాయం పొందగలిగారు. రాష్ట్రంలో అతితక్కువ సాయం పొందిన రైతుల్లో అదిలాబాద్ జిల్లా నుంచి 6888ఎకరాల విస్తీర్ణానికిగాను 9239మంది రైతులు రూ.3,44,43,705 పెట్టుబడి సాయం పొందగలిగారు. ఎకరం పొలం ఉండి రైతుబంధు కింద రూ.5వేలు సాయం పొందిన రైతుల్లో భద్రాచలం కొత్తగూడెం జిల్లానుంచి 28355మంది, జగిత్యాల నుంచి 72439,జయశంకర్ భూపాలపల్లి నుంచి 28753మంది, జోగులాంబ గద్వాల నుంచి 26541మంది, కామారెడ్డి నుంచి 85110మంది, కరీంనగర నుంచి 57220మంది, ఖమ్మం నుంచి 94894మంది, కొమరంభీం జిల్లా నుంచి 17144మంది, మహబూబాబాద్ నుంచి 41944మంది, మహబూబ్ నగర్ నుంచి 50977మంది, మంచిర్యాల నుంచి 38807మంది, మెదక్ జిల్లా నుంచి 83194మంది రైతుబంధు సాయం అందుకున్నారు. మెడ్చెల్ మల్కాజిగిరి నుంచి 12884మంది, ములుగు నుంచి 21309మంది, నాగరకర్నూల్ నుంచి 49708మంది, నారాయణపేట్ నుంచి 26357మంది, నిర్మల్ నుంచి 34762మంది, నిజామబాద్ నుంచి 72596, పెద్దపల్లి నుంచి 43570, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 30188, సంగారెడ్డి నుంచి 83291, సద్దిపేట్ నుంచి 77984, సూర్యాపేట నుంచి 63945, వికారాబాద్ నుంచి 44670మంది, వనపర్తి నుంచి 39947మంది, వరంగల్ అర్బన్ నుంచి 30714మంది, వరంగల్ రూరల్ జిల్లా నుంచి 57247మంది, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 53494మంది రైతులు రైతుబంధు నిధులు పొందగలిగారు.

TS Govt Released Rs 559 Cr Rythu bandhu for Farmers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News