Monday, April 29, 2024

ఒకరిలో కొత్త కరోనా?

- Advertisement -
- Advertisement -

బ్రిటన్ నుంచి వచ్చిన 1060 మందిని 3 రోజుల్లో గుర్తింపు

కొత్తగా మరొకరిలో కరోనా.. 21కి పెరిగిన బాధితులు
ఒకరిలో కొత్త స్ట్రెయిన్?
బ్రిటన్ నుంచి వచ్చిన వారు తమంతట తాముగా ముందుకు రావాలి: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు

మన తెలంగాణ/హైదరాబాద్: బ్రిటన్ నుంచి వచ్చినోళ్ల కోసం వైద్యశాఖ జల్లెడ పడుతుంది. కేవలం 72 గంటల్లో 1060 మందిని ట్రేస్ చేసి ఏకంగా 996 మందికి వైద్యశాఖ పరీక్షలు నిర్వహించడం గమనార్హం. అతి తక్కువ సమయంలో ఇంత మందిని గుర్తించడంపై మంత్రి ఈ టల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు, ఆయన టీమ్‌కు మంత్రి అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా యూకే రిటర్నీస్‌లో కొత్తగా మేడ్చల్ జిల్లాలకు చెందిన మరోకరికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు 21 మందికి పాజిటివ్ తేలగా, మ రో 9 మంది రిపోర్టులు ఫెండింగ్‌లో ఉన్నట్లు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా నిర్ధారణ అయిన వారి లో హైదరాబాద్‌లో నలుగురు, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో తొమ్మిది, జగ్యితాల్లో ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట్, వరంగల్ అర్బన్ జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే వీరందరి శాంపిల్స్‌ను సిసిఎంబి పంపి వేర్వేరు ఆసుపత్రుల్లో ప్రత్యేక చికిత్సను అందిస్తున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
కేంద్రానికి సిసిఎంబి నివేదిక….
కొత్త కరోనా అంశంపై సిసిఎంబి(సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ) శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి ఆదివారం ఓ నివేదికను పంపినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే గురువారం సిసిఎంబికి చేరిన పాజిటివ్‌ల శాంపిల్స్‌లో జీనోమ్ సిక్వెన్సీని గుర్తించిన సైంటిస్టులు, ఒకరికి కరోనా కొత్త స్ట్రెయిన్ ఉన్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తి వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. అతను ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చి వారం రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉన్నారని, కానీ టెస్టు చేయగా కరోనా కన్ఫామ్ అయిందని అధికారులు తెలిపారు. అయితే ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా బాధితులు, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలనూ ఆ రిపోర్టులో పొందుపరిచినట్లు తెలిసింది. అంతేగాక అతని తల్లి శాంపిల్‌ను కూడా అధికారులు సిసిఎంబికి పంపించారు. అయితే ఈ వివరాలను ఒకటి రెండ్రోజుల్లో కేంద్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆరోగ్యశాఖలోని ఓ ఉన్నతాధికారి మన తెలంగాణకు వివరించారు. మరోవైపు ఆ రిపోర్టులో ఇంకా ఏమేమీ అంశాలు ఉన్నాయనేది రాష్ట్ర వైద్యశాఖ లో కూడా ఉత్కంఠ నెలకొంది. బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్లకు సోకింది బ్రిటన్‌లో మ్యూటేషన్ వైరసా? లోకల్ రకమా అనేది మంగళవారం తేలనుందని ఆరోగ్యశాఖ పేర్కొంది.
కొత్త స్ట్రెయిన్‌పై ఆందోళన అవసరం లేదు….
వైరస్ మ్యూటేషన్లు చెందడం సహజమేనని, దానిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్త రకపు వైరస్ సోకినా చికిత్స, పాటించాల్సిన జాగ్రత్తల ప్రోటోకాల్ పాతదేనని అధికారులు తెలిపారు. ఇప్పటికే బ్రిటన్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న ప్రయాణికులకు ఆర్‌టిపిసిఆర్ టెస్టు చేసి పాజిటివ్ తేలితే గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో రెండు ఫ్లోర్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులలో ఉంచి చికిత్సను అందిస్తున్నామని అధికారులు తెలిపారు. అంతేగాక ఇదే తరహాలో ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లోని ఏరియా ఆసుపత్రుల్లోనూ స్పెషల్ వార్డులను ఏర్పాటు చేశామని ఆరోగ్యశాఖ చెబుతోంది.
బ్రిటన్ నుంచి వచ్చినోళ్లు స్చచ్ఛంధంగా ముందుకు రావాలి….హెల్త్ డైరెక్టర్
ఈనెల 8వ తేది తర్వాత బ్రిటన్ నుంచి నేరుగా రాష్ట్రానికి వచ్చిన వారు స్వచ్ఛంధంగా ముందుకు రావాలని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఎయిర్‌పోర్టు ఇచ్చిన జాబితా అడ్రస్‌లలో ప్రస్తుతానికి కొంత మంది వ్యక్తులు లేరని, ఇది తమకు ఇబ్బందికరంగా మారిందని ఆయన అన్నారు. దీంతో యూకే నుంచి వచ్చిన వారు స్వయంగా 040-24651119ను ఫోన్ చేసి లేదా 9154170960 వైద్యశాఖ వాట్సప్‌కు సమాచారం ఇవ్వాలని హెల్త్ డైరెక్టర్ కోరారు. మరోవైపు లక్షణాలు తేలిన వారు వెంటనే ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేయించుకోవాలన్నారు. ఒకవేళ పాజిటివ్ తేలితే చికిత్స తీసుకోవాలని, నెగటివ్ తేలినా క్వారంటైన్‌లో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈనెల 9 నుంచి 23 వరకు బ్రిటన్ నుంచి 1216 మంది తెలంగాణకు చేరుకోగా, వారిలో ఇప్పటి వరకు 1060 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. వీరిలో 6 మంది ఇతర దేశాలకు తిరిగి వెళ్లగా, మరో 58 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే వారి వివరాలను ఆయా రాష్ట్రాలకు పంపంచినట్లు డిహెచ్ పేర్కొన్నారు. అయితే తప్పుడు అడ్రస్‌ల వలన మరో 156 మందిని ఇప్పటి వరకు గుర్తించలేక పోయామని, అతి త్వరలో వారిని కూడా గుర్తిస్తామని అధికారులు వివరించారు.

Total 21 UK Returnees tested positive in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News