Sunday, May 5, 2024

తెలంగాణలో 5వ తరగతి వరకు బడులు లేనట్లే..!

- Advertisement -
- Advertisement -

TS Govt will be Promoted 1 to 5 Classes due to Corona

హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది విద్యా సంవత్సరం(2020-21)లో 1 నుంచి 5 తరగతుల బడులను తెరవకూడదని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలతోపాటు ప్రైవేట్ పాఠశాలలో 1-5 తరగతుల క్లాసులు లేనట్లే. కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికతో 1-5తరగతుల బడులను నిర్వహించకూడదని అధికారుల నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యుకెలో కొత్త స్ట్రెయిన్ వేగంగా విజృస్తోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలతోపాటు భారత్, యుకెకు విమానాలను రద్దు చేసింది. ఇప్పటికే యుకె నుంచి వచ్చిన కొందరికి కరోనా పాజిటీవ్ రావడంతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రాయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో తెలంగాణలోనూ అధికారులు అప్రమత్త మయ్యారు. కొత్త స్ట్రెయిన్ హెచ్చరికతో బడులను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వదని తెలుస్తోంది. దీంతో 1 నుంచి 5 తరగతి క్లాసుల వరకు నేరుగా ప్రమోట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

TS Govt will be Promoted 1 to 5 Classes due to Corona

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News