Monday, April 29, 2024

మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 194 మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 18 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థ (టెమ్రీస్) కార్యదర్శి అయేషా మసరథ్ ఖానం సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 6 చివతి తేదీ అని తెలిపారు. జూనియర్ కాలేజీల్లో జనరల్, ఒకేషనల్ మొదటి సంవత్సరంలో టెమ్రీస్ అధికారిక వెబ్‌సైట్ ww.tmreistelangana.caq.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10 సిఓఈ టిఎంఆర్ జూనియర్ కాలేజీల్లోనూ మొదటి సంవత్సరంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 202425 విద్యాసంవత్సరానికి జరిగే ఈ ప్రవేశాల్లో 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 204 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.

ఈ అవకాశాన్ని అర్హులైన మైనారిటీ, ఎస్‌షి, ఎస్‌టి, బిసి, ఓసి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మైనారిటీలు (ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు, సిక్కులు, బౌద్ధులు), మైనారిటీయేతర (ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఒసి లు) కమ్యూనిటీల నుండి అర్హులైన అభ్యర్థులు టెమ్రీస్ మొబైల్ యాప్ (గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు) ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 5వ తరగతి లో మైనారిటీలకు – ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, నాన్-మైనారిటీల కోసం- లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని, తరగతులు 6, 7, 8 లలో మైనారిటీల బ్యాక్‌లాగ్ ఖాళీ ల భర్తీకి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ విధానంలో ఎంపిక ఉంటుందన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్, ఒకేషనల్ లలో ప్రవేశాలకు ఎస్‌ఎస్‌సి లేదా 10వ తరగతి 2024లో జిపిఎ ఆధారంగా, మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. ఇంటర్మీడియట్ (సిఓఈ టిఎంఆర్‌జెసి)లో స్క్రీనింగ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుందన్నారు.

తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఫిబ్రవరి 6వ తేదీ లోగా లేదా రాష్ట్రంలోని ఏదైనా టిఎంఆర్ సంస్థ లేదా ఏదైనా ఇంటర్‌నెట్ కేంద్రం నుండి ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలని కోరారు. మరిన్ని వివరణల కోసం టెమ్రీస్ అధికారిక వెబ్‌సైట్ www.tmreistelangana.cag.gov.inని సందర్శించవచ్చన్నారు. లేదా రాష్ట్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌ల జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి లేదా ప్రిన్సిపాల్ లేదా హెల్ప్‌లైన్ నెం. 040- 23437909కు సంప్రదించవచ్చన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News