Saturday, April 27, 2024

ఆరు నెలల తర్వాత రోడ్డెక్కిన సిటీబస్సులు

- Advertisement -
- Advertisement -
TSRTC buses back on Hyderabad roads
ఎన్నాళ్ళకెన్నాళ్లకు…. 39 రూట్లు.. 731బస్సులు

హైదరాబాద్: కరోనా కారణంగా ఆగిపోయిన సిటీఆర్‌టిసి బస్సులు సుమారు 188 రోజుల తర్వాత శుక్రవారం రోడ్డెక్కాయి. కరోనా పై ప్రయాణికులకు అవగాహన పెరగడంతో ముందుగా శివారు ప్రాంతాల్లో 235 నడిపినఅధికారులు అనంతరం నగరంలో కూడ బస్సులను తిప్పారు. ప్రయాణికుల నుంచిమంచి స్సందన రావడంతో గ్రేటర్‌హైదరాబాద్ జోన్ పరిధిలోకి 29 డిపోల నుంచి 39 రూట్లలో 731 (25శాతం ) బస్సులను నడిపారు. శివారు ప్రాంతాల నుంచి నగర నడిబొడ్డున ఉండే ప్రాంతాలను కలుపుతూ బస్సులను నడిపినట్లు సికింద్రాబాద్. ఇబ్రహీం పట్నం, హఖీంపేట.. సికింద్రాబాద్, ఉప్పల్, లింగంపల్లి, పటాన్‌చెరు, సికింద్రాబాద్, కోటీ.. గండిమైసమ్మ,మేడ్చెల్ సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల నుంచే కాకుండా, నగరంలోని ప్రధాన రద్దీ ప్రాంతాలైన కోటీ,మెహదీపట్నం, సికింద్రాబాద్ అఫ్జల్‌గంజ్, ఉప్పల్ మెహదీపట్నం తదితర రూట్లలోబస్సులను తిప్పినట్లు చెప్పారు. ప్రయాణికుల సంక్షేమం కోసం అధికారులు కోవిడ్‌కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

ముఖ్యంగా డిపో నుంచి బయటకు బస్సులను తీసుకువచ్చేముందు వాటిని పూర్తిస్థాయిలో శానిటైజ్ చేసిన అధికారులు సిబ్బంది కూడా తప్పకుండా మాస్కు ధరించేలా చూడటమే కాకుండా వారికి ధర్మోస్క్రీనింగ్‌చేసిన అనంతరమే విధుల్లోకి తీసుకున్నారు. అధికారులు బస్సులను నడిపినా ప్రయాణికులు మాత్రం భయం భయంగా బస్సుల్లో ప్రయాణించడం కనిపించింది. ఒకటి రెండు మూడు రోజులు ఇటువంటి పరిస్థితి ఉంటుందని అనంతరం పుంజుకుంటుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా ఒకటి , రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో బస్సులను తిప్పిందుకు ప్రణాళికులు సిద్దం చేస్తున్నామని ఈ మేరకు డిపోమేనేజర్లకు బస్సులను పూర్తి స్థాయిలో సిద్దం చేసి ఉంచాలని ఆదేశాలు కూడా జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News