Monday, April 29, 2024

పాపం..ఆ దేశానికి సునామీ తప్పదా?

- Advertisement -
- Advertisement -

ప్రకృతి వైపరీత్యాలకు జపాన్ పెట్టింది పేరు. ఒకవైపు భూకంపాలు, మరోవైపు తుపానులు ఆ దేశాన్నిఅతలాకుతలం చేస్తూ ఉంటాయి. తాజాగా జపాన్ కు నాలుగువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పపువా న్యూ గినియా దీవుల్లో పేలిన ఓ అగ్ని పర్వతం కారణంగా జపాన్ కు సునామీ ముంపు తప్పేటట్లు కనిపించడం లేదు.

మౌంట్ ఉలవున్ అనే పేరు గల అగ్నిపర్వతం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో బద్దలై, లావా వెదజల్లుతోంది. దీనికారణంగా పెద్దయెత్తున పొగలు 15 వేల మీటర్ల వరకూ కమ్ముకుంటున్నాయి. దాంతో జపాన్ కు సునామీ రావచ్చని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. అగ్ని పర్వతం బద్దలైన మూడు గంటలకు కెరటాలు ఉధృతంగా లేచి మొదటగా ఇజు, ఒగసవర దీవులను తాకుతాయని పేర్కొంది. అయితే సునామీ ప్రభావం ఏ మేరకు ఉంటుందో ఇప్పుడే చెప్పలేని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News