Saturday, April 27, 2024

అండర్19 ప్రపంచకప్: ఫైనల్‌కు భారత్..

- Advertisement -
- Advertisement -

U-19 World Cup Semifinals: India beat Aus by 96 runs

ఆంటిగ్వా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్19 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. కెప్టెన్ యశ్ ధూల్ పది ఫోర్లు, ఒక సిక్సర్‌తో (110) కదం తొక్కాడు. ఇక వైస్ కెప్టెన్ షేక్ రషీద్ 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 94 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు. చివర్లో వికెట్ కీపర్ దినేశ్ 20(నాటౌట్) దూకుడుగా ఆడడంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసింది. ఒక దశలో 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును యశ్, రషీద్ లు రికార్డు స్థాయిలో 204 పరుగులు జోడించి ఆదుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్ 194 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

మరోవైపు, అఫ్గానిస్థాన్‌తో ఆసక్తికరంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 215 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇంగ్లండ్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. దీంతో అండర్19 ప్రపంచకప్‌లో ఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఇక భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఇంగ్లండ్ తుది పోరులో తలపడుతుంది.

U-19 World Cup Semifinals: India beat Aus by 96 runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News