Thursday, May 9, 2024

రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే అనూహ్య మార్పులు

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పట్టణాలలో అనూహ్యమైన మార్పులు వచ్చాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగం గా శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాకపూర్వం మహబూబ్‌నగర్ పట్టణం లో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని, ఇ ప్పుడు ఆ సమస్య లేదని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు తాగునీరు అందిస్తున్నామని, అదే విధం గా విద్యుత్ సమస్య సైతం తీరిపోయిందని, పట్టణంలో పార్కులు అభివృద్ధ్ది చేశామని, పాఠశాలలు వచ్చాయని, ప్రత్యేకించి 6 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, 6 కళాశాలలు ఏర్పాటు చేసామని, రహదారులు,జంక్షన్‌లను అభివృద్ధి చేశామని, ఐటి పా ర్క్ వచ్చిందని, 300 కోట్ల రూపాయల రుణాలను పట్టణ మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చామని, మహిళలకు రక్షణ పెరిగిందని, షీ టీమ్స్, సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని, వచ్చే సంవత్సరం నాటి కి ఐటి పార్క్ ద్వారా 20వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని, ఉన్న చోటనే ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.

పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల స్థలాలు, భూముల రేట్లు, ఒకప్పుడు దుర్గంధంతో ఉండేదని , దానిని అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని, ఇవన్నీ ప్రజ లు గమనించాలని ఆయన తెలిపారు. తెలంగాణ రాక ముంప రాష్ట్రంలో 10 గరుకులాల నుండి ఇప్పుడు 1000 గురుకాలకు పెంచడం జరిగిందని తెలిపారు.పట్టణంలో వెనుకబడిన ప్రాంతంగా పే రొందిన వీరన్నపేటలో 800 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించామని, త్వరలోనే వీరన్నపేట వెనకవైపు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర 30 ఎకరాలలో నూతన ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించనున్నామని, చిన్నదర్పల్లి లో 350 ఎకరాలలో ఫుడ్ పార్కు రానుందని, అప్పన్నపల్లి రెండవ ఆర్వోబి పూర్తి అయిందని, 12 నెలల్లోనే పారంభిస్తామని తెలపారు.

ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సిఎం కె. చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ప్రత్యేకించి మహబూబ్‌నగర్ పట్టణం ఎంతో అభివృద్ధ్ది చెందింద ని అన్నారు జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత పట్టణాలలో మౌలి క సదుపయాలు పెరిగాయని, పట్టణాల అభివృద్ధి కి చాలా కర్యక్రమాలు చేపట్టడం జరిగిందని, వివిధ నిధుల ద్వారా చిన్న పట్టణాలను సైతం పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని, అధికారులు, సిబ్బ ంది ఇదే స్ఫూర్తితో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీ కె. నర్సింహ, మున్సిపల్ చైర్మ న్ కేసి నర్సిములు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ము న్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, కమిషనర్ ప్రదీప్‌కుమా ర్ , కౌన్సిలర్లు, మున్సిల్ ఇంజనీర్లు, ఉద్యోగులు , సిబ్బంది తదితరులు హాజయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News