Friday, April 26, 2024

షెడ్యూల్ ప్రకారమే యుపి ఎన్నికలు

- Advertisement -
- Advertisement -
UP elections as scheduled
ఎన్నికలను వాయిదా వేయొద్దని అన్ని పార్టీలు కోరాయి
కొవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తాం
పోలింగ్ గంట పొడిగింపు
సిఇసి సతీశ్ చంద్ర స్పష్టీకరణ

లక్నో: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్త్తి నేపథ్యంలో త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్న వేళ ఎన్నికల కమిషన్ దీనిపై స్పష్టత ఇచ్చింది. యుపి అసెంబ్లీ ఎన్నికల వాయిదా ఉండదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని, ఎన్నికల ప్రధానాధికారి సతీశ్ చంద్ర గురువారం వెల్లడించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌తో పాటుగా ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగాలి ఉంది. యుపిలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం కాల పరిమితి మే నెలలో ముగియనుండగా, మిగతా రాష్ట్రాలో అసెంబ్లీల గడువు మార్చిలో ముగియనుంది. అయితే గత కొన్ని రోజులుగా ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న దృష్టా ఎన్నికలు వాయిదా వేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అలహాబాద్ హైకోర్టు కూడా కేంద్రానికి యుపి ఎన్నికలను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.

ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖతో సమావేశమైన ఇసి ఉత్తరప్రదేశ్‌లో పర్యటించింది. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడం కోసం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన ఇసి అక్కడ అన్ని రాజకీయ పార్టీల నేతలతోను సమావేశమయింది. లక్నోలో విలేఖరుల సమావేశంలో మాట్లాడిన ఎన్నికల ప్రధానాధికారి సతీశ్ చంద్ర అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. ‘యుపి అసెంబ్లీ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల అభి్రప్రాయాలను విన్నాం. ఎన్నికలను వాయిదా వేయొద్దని అన్ని పార్టీలు కోరాయి.అయితే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపాయి.అందువల్ల యుపి సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని నిర్ణయించాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ నిర్వహిస్తాం.తుది ఓటర్ల జాబితాను 2022 జనవరి 5న విడుదల చేస్తాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లోను వివిప్యాట్‌లను ఏర్పాటు చేయనున్నాం.

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా లైవ్ వెబ్‌కాస్టింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాం’ అని సతీశ్ చంద్ర వెల్లడించారు. అంతేకాకుండా ఓటర్లు భౌతిక దూరాన్ని పాటించేందుకు వీలుగా పోలింగ్ సమయాన్ని గంట పెంచుతున్నట్లు కూడా తెలిపారు. ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌కు అవకాశం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఇసి అనేక సూచనలు చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించింది. కొవిడ్ బాధితుల కోసం ఇంటినుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సుశీల్ చంద్ర తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News