Monday, April 29, 2024

మేకల మందను ఢీకొట్టిందని వందే భారత్‌పై రాళ్ల దాడి

- Advertisement -
- Advertisement -

అయోధ్య : ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్ లఖ్‌నవూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై మంగళవారం కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో రెండు బోగీల అద్దాలు పాక్షింకంగా దెబ్బతిన్నాయి. తమ మేకల మందను ఢీకొట్టిందన్న ఆగ్రహంతో రాళ్ల దాడికి పాల్పడినట్టు బయటపడింది. ఈ సంఘటనపై ముగ్గురిని అరెస్టు చేసినట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్ ) సోను కుమార్ సింగ్ చెప్పారు. ఈ రైలును ప్రధాని మోడీ జులై 7 న ప్రారంభించారు.

మంగళవారం రైలు సోహవాల్ ప్రాంతానికి చేరుకునేసరికి ముగ్గురు రాళ్లు రువ్వారు. బోగీల కిటికీల అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నా రైలు మాత్రం గమ్యస్థానానికి చేరుకుంది. ఆదివారం రైల్వే ట్రాక్‌పై గడ్డిమేస్తున్న సమయంలో వందేభారత్ రైలు ఢీకొని నన్హు పాసవాన్‌కు చెందిన మేకల మంద చనిపోయింది. దీనిపై ఆగ్రహంగా ఉన్న పాసవాన్,అతని ఇద్దరు కుమారులు మంగళవారం ఉదయం రైలుపై రాళ్లు రువ్వారని రైల్వే పోలీస్‌లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News