Wednesday, May 1, 2024

అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది: ట్రంప్

- Advertisement -
- Advertisement -

 

గాంధీనగర్: అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుందని, ప్రేమిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సోమవారం అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో భారతీయునులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ”మోతెరా స్టేడియం అద్భుతంగా ఉంది. ప్రపంచంలో అతిపెద్ద స్టేడియాన్ని ప్రారంభించిడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. 8 వేల మైళ్ల దూరం నుంచి వచ్చి సందేశమిస్తున్నా. మోడీతో కలిసి ఈ సమావేశంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. మోడీ ఫ్రైడ్ ఆఫ్ గుజరాత్ మాత్రమే కాదు.. భారత్ కోసం ఏదైనా చేసే గొప్ప నాయకుడు. అమెరికా హృదయంలో భారత్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. మా కుటుంబమంతా మీరు కనబరిచిన ప్రేమను చిరకాలం గుర్తించుకుంటుంది. 70 ఏళ్లలో అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా భారత్ అవతరించింది. ఆర్థికంగానూ బలమైన దేశంగా భారత్ నిలిచింది. భారత్ గొప్ప ప్రజాస్వామ్య, శాంతికాముక దేశం. స్వామి వివేకానంద బోధనలు ప్రతిఒక్కరికీ ఆదర్శనీయం.  భిన్న మతాలు, జాతుల సమ్మేళనం ఇండియా. దీపావళి, హోలీ లాంటి పండుగలు సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపడతాయి. వందల భాషలు, 28 రాష్ట్రాలతో భిన్నత్వంలో ఏకత్వం భారత్. సత్యాగ్రహం చేసిన సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించడం గొప్ప అనుభూతి కలిగించింది. అద్భుతమైన కట్టడం తాజ్ మహాల్ చూడబోతున్నాం. శక్తివంతమైన సైన్యం ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. నేను అందరికీ చెప్తుంటా మోడీ అసాధ్యుడని. భారతదేశ చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. సచిన్ విరాట్ కోహ్లీ లాంటి అద్భుతమైన క్రికెట్ ఆటగాళ్లున్న దేశం భారత్. సంవత్సరానికి 2వేల సినిమాలను నిర్మిస్తున్న దేశం ఇండియా. అంతరిక్ష ప్రయోగాల్లో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సదస్సుకు ఇవాంకా హాజరైంది. రేపు భారత్- అమెరికా మధ్య సైనిక హెలికాప్టర్ల ఒప్పందం కుదుర్చుకుంటాం. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం కొనసాగుతోంది. 3 బిలియన్ల రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాం. ఐసిస్ ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టాం. అల్ బాగ్దాదీని మట్టుబెట్టడంలో విజయం సాధించాం. ప్రపంచంలో ప్రతి భారతీయుడికి భద్రత ఉంది. టెర్రరిజాన్ని అమెరికా ఏమాత్రం సహించబోదు. ఉగ్రవాదులను ప్రోత్సహించవద్దని పాకిస్థాన్ ను కోరుతున్నా. ఇస్లామిక్ టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడాలి” అని ట్రంప్ పిలుపునిచ్చారు.

US President Trump

US President Trump Addresses in Motera Stadium 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News