Saturday, April 27, 2024

ట్రిపుల్ టితో అదుపులో కరోనా

- Advertisement -
- Advertisement -

Vaccine distribution arrangements should be prepared

 

తెలంగాణ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది : కేంద్ర కేబినెట్ కార్యదర్శితో వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్
త్వరలో టీకా : రాజీవ్ గౌబా

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని కేంద్ర క్యాబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌభ ఆదేశించారు. అతి త్వరలో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉన్నందున అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ స్టోరేజ్‌కు, పంపిణీపై ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ మహమ్మారి నివారణకు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ వ్యాక్సిన్‌పై చేపడుతున్న ఏర్పాట్లపై ఆయన వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శిలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తు.చ తప్పక పాటించాలన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4.5 లక్షల యాక్టివ్ కేసులుండగా, మరణాల శాతం గణనీయంగా తగ్గిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వైరస్ ప్రభావిత ప్రాంతాలలో నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అంతేగాక వీలైనంత వరకు టెస్టింగ్ కెపాసిటీని పెంచాలన్నారు. మరోవైపు వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే అందరికీ అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ నిల్వ కోసం కోల్డ్ చైన్ గుర్తించడం, వ్యాక్సిన్ రవాణా తదితర అంశాలపై సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని ఆయన సూచించారు.

తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుంది: సిఎస్ సోమేష్‌కుమార్

కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుందని సిఎస్ సోమేష్‌కుమార్ అన్నారు. ఐసిఎంఆర్, డబ్లూహెచ్‌ఓ ప్రోటోకాల్స్‌ను సమర్ధవంతంగా పాటిస్తున్నామని ఆయన కేంద్రానికి తెలిపారు. కేంద్ర కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సోమవారం ఆయన సచివాలయం నుంచి పాల్గొని కరోనా కట్టడిపై తెలంగాణ తీసుకున్న నిర్ణయాలను కేంద్రానికి వివరించారు. ఈ సందర్బంగా సిఎస్ మాట్లాడుతూ..ట్రిపుల్ టి విధానాన్ని అద్బుతంగా అమలు చేయడంతోనే తెలంగాణాలో కరోనా అదుపులో ఉందని సిఎస్ కేంద్ర అధికారులకు వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేట్ ఏకంగా 95 శాతానికి పైగా రికార్డు అవుతోందని, ఈ పరిస్థితి మరేరాష్ట్రంలోనూ లేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన చికిత్సను అందించడం వలనే ఇది సాధ్యమవుతున్నట్లు ఆయన వెల్లడించారు. వైరస్ సోకిన వారిని వేగంగా గుర్తించడం, వ్యాధిని నిర్ధారించడం, ఆ వెంటనే చికిత్సను ప్రారంభించడం వంటివి చాలా వేగంగా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిజిపి మహేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ రవిగుప్తా, అదరపు డిజి జితేందర్, ప్రిన్సిపాల్ సెక్రటరీ పొలిటికల్ వికాస్ రాజ్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News