Monday, April 29, 2024

వైకుంఠ ఏకాదశి: ఆలయాలకు పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

వైష్ణవాలయాల్లో వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తిరుమల, భద్రాచలం, శీరంగం ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారం తెరుచుకుంది.

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు శ్రీవారి సేవలో నిమగ్నమయ్యారు. జస్టిస్ ప్రశాంత్ కుమార మిశ్రా, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్ఎల్ భట్టి,హై కోర్టు న్యామమూర్తి జస్టిస్ రవీంద్రబాబు, జస్టిస్ శ్యామ్ సుందర్, జస్టిస్ తారాల రాజశేఖర్, మాజీ సిజెఐ జస్టిస్ ఎన్వీ రమణ, కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖుల వైకుంఠ ద్వార దర్శనం మూడున్నర గంటల పాటు సాగిందని ఆలయ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News