Friday, May 10, 2024

అభిమానులకు పవన్ ట్రిపుల్ ధమాకా..

- Advertisement -
- Advertisement -

Vakeel Saab motion poster release on Sept 2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలకు సంబంధించి ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి వరుస అధికారిక అప్‌డేట్లు రాబోతుండడం విశేషం. బుధవారం పవన్ పుట్టినరోజు కావడంతో భారీ ట్రెండ్‌ను కూడా పవన్ అభిమానులు ప్లాన్ చేశారు. అలాగే ఇదే సమయంలో మరోపక్క ఈ స్టార్ హీరో నటిస్తున్న సినిమాలకు సంబంధించిన ట్రిపుల్ ఫీస్ట్‌కు రంగం సిద్ధమైంది. మొదటగా పవన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వకీల్ సాబ్’ నుంచి చిత్ర యూనిట్ బుధవారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఒక సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేయగా… ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు క్రిష్‌తో నటిస్తున్న తన 27వ చిత్రానికి సంబంధించి ఒక స్పెషల్ పోస్టర్ రానుంది. ఇక సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు తన బ్లాక్‌బస్టర్ కాంబో హరీష్ శంకర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక అధికారిక ప్రకటన రానుంది. దీంతో పవర్‌స్టార్ నుంచి ట్రిపుల్ ధమాకా ఖరారైందని చెప్పాలి.

Vakeel Saab motion poster release on Sept 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News