Monday, April 29, 2024

ఎల్గార్ పరిషత్ కేసులో వరవరరావుకు బెయిలు తిరస్కరణ

- Advertisement -
- Advertisement -

Varavara Rao

 

ముంబై : ఎల్గార్ పరిషత్ కేసులో నిందితులైన వరవరరావు (80), షోమాసేన్ (60)లకు ముంబై కోర్టు మంగళవారం బెయిలు తిరస్కరించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బెయిలుపై విడుదల చేయాలని వీరు దరఖాస్తులు పెట్టుకున్నారు. నిందితులు అనేక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఇంతేకాక వయోవృద్ధులైనందున కరోనా సంక్రమించే అవకాశం కూడా ఉంది. వరవరరావు నవీముంబై లోని తలోజా జైలులో బందీగా ఉన్నారు. సేన్ బైకుల్లా జైలులో ఉన్నారు. హృదయ కోశ వ్యాధులు, డయాబెటిస్, శ్వాసకోశ సమస్యలు తదితర అనేక అనారోగ్య సమస్యలున్నందున కరోనా వంటి తీవ్ర వ్యాధికి గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని అందుచేత బెయిలు మంజూరు చేయాలని కోరారు. నిందితుల బెయిలు దరఖాస్తులకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకాష్ సెట్టి అభ్యంతరం తెలిపారు. నిందితులు గతంలో దాఖలు చేసిన అనేక బెయిలు దరఖాస్తులను తిరస్కరించడమైందని వాదించారు.

 

Varavara Rao bail denied in Elgar Parishad case
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News