Thursday, May 9, 2024

వర్మ ’క్లైమాక్స్’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Varma Climax Movie Trailer Released

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ’క్లైమాక్స్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘జిఎస్‌టి’(గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) చిత్రంలో నటించిన పోర్న్ స్టార్ మియా మల్కోవా ప్రధాన పాత్రలో వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక, ‘జిఎస్‌టి’ సినిమాను కూడా వర్మనే రూపొందించిన విషయం తెలిసిందే. ఇటీవల వర్మ తన ట్వీట్టర్ అకౌంట్ ద్వారా ’క్లైమాక్స్’ టీజర్ ను విడుదల చేశాడు. ఈ టీజర్‌లో మియా మల్కోవా అంగాంగ ప్రదర్శనను ఘాటుగా చూపించాడు వర్మ.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను వర్మ విడుదల చేశాడు. ఇందులోనూ మియా మల్కోవా హాట్ అందాలు ఆరబోసింది. దీంతోపాటు థ్రిల్లర్ సీన్లతో ఈ ట్రైలర్ ను ఆసక్తి కలిగేలా రూపొందించాడు. కాగా, శృంగారం కోసం ఎడారికి వెళ్లిన ఓ జంట అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నదే ఈ సినిమా కథగా తెలుస్తోంది.

Varma’s Climax Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News