Monday, April 29, 2024

నేల చూపులు చూస్తున్న కూరగాయల ధరలు

- Advertisement -
- Advertisement -

భారీ ఎత్తున దిగబడి పెరగడమే కారణం
మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి
మార్కెటింగ్‌శాఖ అధికారులు

మన తెలంగాణ/సిటీబ్యూరో : గ్రేటర్‌లో హై దరాబాద్‌లోని మార్కెట్లో కూరగాయల ధరలు సగానికి పైగా తగ్గాయి. నెల రోజులు వరకు ఆకాశాన్ని తాకిని కూరగాయల ధరలు నేడు నేలక చూపులు చూస్తున్నాయి. ఒక నెల క్రి తం వరకు ఆకాశాన్ని అంటిన టమాట ధర లు నేడు కిలో రూ.10 పడిపోయింది. బీర, చి క్కుడు, వంకాయ, బెండ కాకర, క్యారెట్ తదితర కూరగాయాల ధరలు సైగానికి పైగానే దిగివచ్చాయి. ఏ కూగగాయ ధర అయినా రూ . 35 నుంచి 40 లోపు పలుకుతున్నాయి. బోయినపల్లి మార్కెటలో సాధారణ రోజుల్లో 30 వేల నుంచి 40 వేల క్వింటాళ్ళ లోపు, గుడిమల్కాపూర్ ,ఎన్టీఆర్ మార్కెట్లో 10 వేల క్వింటాళ్ళలోపు కూరగాయలు దిగమతి అ య్యేవి.

గతవారం రోజులుంగా రెట్టింపు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని 11 ప్రధాన రైతుబజార్లలో సైతం కూరగాయలు భారీ ఎత్తును దిగుమతి అవుతున్నాయి. డిమాండ్ మించి కూరగాయలు దిగమతి కావదంతో ధరలు దిగివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.ఇదే పరిస్థితి మరో నెల రోజులు పాటు ఉంటుందని వారు అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు.కోటికి పైగా ఉన్న నగరానికి ప్రతి రోజు సుమారు 300మెట్రిక్ టన్నుల కూగరాయల అవసరం ఉంటుంది. కాని ప్రస్తుతం నగర ప్రజల అవసరాలకు మించి దిగుమతి అవుతున్నాయి.

దాంతో నగరంలోని గుడిమల్కాపూర్,బోయినపల్లి, ఎన్టీఆర్ మార్కెట్‌తో పాటు రైతు బజార్లు కూరగాయలు దిగుమతితో కళకళాడుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చెల్,మెదక్, సిద్దిపేట,వికాబాద్, సంగారెడ్డి,తదితర పోరుగు జిల్లాలతో పాటు ఏపీ, కర్నాటక,మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్,మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రల నుంచి కూడా భారీ ఎత్తున దిగుమతి అవుతున్నాయి .ఉమ్మది తెలుగు రాష్ట్రాలతో పాటు నగరానికి రవాణా అయ్యే రాష్ట్రాల్లో ఈ సంవత్సరం భారీ ఎత్తున కూరగాయల సాగు పెరిగిందని మరో నెల రోజుల పాటు కూరగాయల ధరలు అందుబాటులో ధరలో ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లోని కూరగాయల ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
టమాట కిలో రూ: 10.00
వంకాయ కిలో రూ: 23.00
పచ్చిమిర్చి కిలో రూ: 35.00
కాకరకాయ కిలో రూ: 25.00
క్యాబేజీ కిలో రూ: 10.00
క్యారెట్ కిలో రూ : 16.00
క్యాలీఫ్లవర్ కిలో రూ: 15.00
బీట్‌రూట్ కిలో రూ: 19.00
దోసకాయ కలో రూ: 19.00

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News