Monday, April 29, 2024

ప్రజల ముగింటకు.. పల్లె పద్దులు

- Advertisement -
- Advertisement -

ఈ గ్రామస్వరాజ్ యాప్‌లో ఆదాయ, వ్యయాల వివరాలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధుల వినియోగంపై పారదర్శకంగా ప్రజలకు తెలిపేందుకు ఈ గ్రామ స్వరాజ్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గ్రామ పంచాయతీ పరిధిలో ఆదాయ,వ్యయాలు తెలుసుకోవాలంటే పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అధికారులు, ప్రజాప్రతినిధులను ఆరా తీయాల్సిందే.. లోటు పాట్లు సైతం తెలియవు. ఈ విషయంలో మరింత పారదర్శకత పాటించేలా కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామస్వరాజ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొ చ్చింది. తద్వారా పంచాయతీల పద్దుల వివరాలు ప్రజల ముంగిటకు వచ్చాయి. ఈ యాప్‌ను రెండేళ్ల క్రితమే తీసుకురాగా, పలు కారణాలతో వివరాలన్నీ నిక్షిప్తం చేయలేదు. గతేడాది నుంచి అన్నింటి ఇందులో పొందుపరుస్తున్నారు. రాష్ట్రంలోని జిల్లా వ్యాప్తంగా పంచాయతీల సంబంధిత వివరాలను ఈ యాప్‌లో అందుబాటులో ఉంచారు.
ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్..
ఫోన్‌లో ఈ- గ్రామస్వరాజ్ అని ప్లే స్టోర్‌లో టైప్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని తెరవగానే రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామానికి సంబంధించిన సమాచారం నమోదు చేయగానే మూడు వివరాలు కలిగిన పేజీ స్తుంది. వీటిలోకి వెళ్లి పరిశీలిస్తే అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వ్యయాలు, అభివృద్ధి పనుల నివేదికలూ ఇందులో కనిపిస్తాయి. గ్రామ పంచాయతీ పనులను జిపిఆర్‌ఎస్ ద్వారా గుర్తిస్తున్నారు. దీంతో ఒక్కసారి చేసిన పనులకు మరోసారి బడ్జెట్ కేటాయించడానికి వీలుండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సంఘ నిధుల వివరాలు, ఎన్ని పనులకు ఎంత ఖర్చు, కార్మికుల, సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు వంటి సమాచారం. యాప్‌లో పొందుపరిచారు.
అంశాలన్నీ ఒకే చోట…
గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధుల వివరాలను పొరపాట్లకు తావు లేకుండా.. యాప్‌లో ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. గత ఆస్తుల నిర్వహణ, జియోట్యాగింగ్ వంటి అప్లోడ్ చేయడంతో పారదర్శకత పెరుగుతుంది. గ్రామ ప్రతినిధుల కమిటీ, సర్పంచి, గ్రామకార్యదర్శుల వివరాలను పొందపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News