Monday, April 29, 2024

పంజాబ్ కాంగ్రెస్‌లో మాటల యుద్ధం..

- Advertisement -
- Advertisement -

War of words in Punjab Congress

రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించాలి
కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ సిద్ధు
ఐదు నెలలుగా పార్టీలో గందరగోళం :ఎంపి మనీశ్‌తివారీ

చండీగఢ్: కెప్టెన్ అమరీందర్‌సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించినా పంజాబ్ కాంగ్రెస్‌లో గొడవలు సద్దుమణిగినట్టు లేదు. రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించాలని ఓవైపు కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ నవజోత్‌సింగ్ సిద్ధూ అనగా, మరోవైపు ఆ పార్టీ ఎంపి మనీశ్‌తివారీ తమ పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొన్నదని, అరాజకత్వం(అనార్కీ) ప్రబలుతోందన్నారు. రాష్ట్రానికి బాగు చేయలేనంత నష్టం జరిగిందని, ఇది తమకు చివరి అవకాశమని సిద్ధూ ట్విట్ చేశారు. ఆర్థిక అత్యవసర పరిస్థితి తమపై రుద్దబడిందన్నారు. రాష్ట్ర వనరులు ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్లకుండా ఖజానాకు తేవాల్సి ఉన్నదన్నారు. గత ఐదు నెలలుగా తమ పార్టీ నేతలు చిన్నపిల్లల్లా గొడవ పడుతున్నారని, అసభ్యపదజాలంతో దూషించుకుంటున్నారని తివారీ ట్విట్ చేశారు. మరోవైపు అమరీందర్‌సింగ్ బిజెపిలో చేరుతారని అందరూ ఊహించగా, ఆయన సొంత పార్టీ పెట్టనున్నట్టు ఇటీవల ప్రకటించడం గమనార్హం. శిరోమణి అకాలీదళ్‌బిజెపి సంకీర్ణ పాలనలో పంజాబ్‌ను కుదిపేసిన డ్రగ్స్ మాఫియా, ఇసుక అక్రమ తవ్వకాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అవినీతిపై అమరీందర్ చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News