Saturday, April 27, 2024

కోవిడ్ 19పై అప్రమత్తంగా ఉన్నాం

- Advertisement -
- Advertisement -

CoVID 19

 

88 మంది అనుమానితులకు పరీక్షలు
ఏ ఒక్కరికీ వైరస్ ఉన్నట్లు నిర్థారణ కాలేదు
ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా అనుమానితులకు పరీక్షలు చేయగా, వారిలో ఒక్కరికి కూడా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కాలేదని మంత్రి ఇటెల రాజేందర్ తెలియజేశారు. రాష్ట్రంలో ఒక్క కొవిద్-19(కరోనా వైరస్) కేసు నిర్ధారణ కాలేదని, ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఒక వ్యక్తి ఐసోలేషన్‌లో వైద్యు ల పర్యవేక్షణలో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇదిలావుండగా హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కరోనా థర్మల్ స్కానింగ్ ద్వారా స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోందన్నా రు. గత నెల 30 నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో 8,212 మందికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేశామన్నారు.

అనుమానితులు చైనా, హాంకాంగ్, దక్షిణకొరియా, థాయ్‌లాండ్, సింగపూర్, జపాన్ తదితర దేశాల నుంచి వచ్చినవారని, కరోనా లక్షణాలుంటే ప్రాథమికంగా థర్మల్ స్కానింగ్‌లో గుర్తించడానికి వీలుంటుందన్నారు. ప్రధానంగా జ్వరం ఉష్ణోగ్రతలు థర్మల్ స్కానింగ్‌లో గుర్తిస్తారని, ఆపై జలుబు, దగ్గు వంటి లక్షణాలుంటే నేరుగా నిర్ధారిస్తున్నామన్నారు. థర్మల్ స్కానింగ్‌లో కరోనా అనుమానిత లక్షణాలున్న వారిలో కొందరిని ఆసుపత్రికి తరలించగా, మరికొందరికి జాగ్రత్తలు సూచిస్తూ వారి వారి ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూసుకోవాలని సలహాలిచ్చి పంపారన్నారు. ప్రజలు పుకార్లను ఏమాత్రం నమ్మవద్దని, కొవిద్- 19పై ప్రభు త్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నదని ఈ సందర్భంగా మంత్రి మీడియాకు వెల్లడించారు.

కేరళలో వైరస్‌పై విజయం
కరోనా బారినపడి ముగ్గురు విద్యార్థులు కేరళలోని ఆసుపత్రిలో వైద్యుల చికిత్సతో స్వస్థత పొందినట్లు తెలుస్తోంది. చైనాలోని వుహాన్ లో మెడిసిన్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఇటీవలే భారత్ తిరిగొచ్చారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో వారికి కరోనా సోకినట్టు గుర్తించారు. అయితే వారిని కేరళలో ప్రత్యేక వార్డులకు తరలించారు. వైద్య,ఆరోగ్యశాఖకు చెందిన వైద్య నిపుణులు ఈ ముగ్గురు విద్యార్థులకు చికిత్స అందించారు. కొన్నిరోజుల చికిత్స అనంతరం వారిలో కరోనా వైరస్ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయినట్టు గుర్తించారు. దీనిపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి థామస్ ఐజాక్ స్పందిస్తూ, గతంలో నిపా వైరస్ ను జయించామని పేర్కొన్నారు. ఇప్పుడు కరోనా వైరస్ పై పోరాటంలోనూ కేరళ విజయం సాధించిందని తెలిపారు.

నౌకలో మరో భారతీయుడికి కోవిడ్
1500కు చేరువలో మృతుల సంఖ్య
న్యూఢిల్లీ/టోక్యో : జపాన్‌లోని యెకోహూమా తీరంలో నిలిపివేసిన ‘డైమండ్ ప్రిన్సెస్’ నౌకలోని భారతీయుల పరిస్థితి రోజురోజుకు ఆందోళకరంగా మారుతుంది. ఇక్పటికే ఆ నౌకలోని ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు టోక్యోలోని భారత ఎంబసీ ధ్రువీకరించింది. ప్రస్తుతం బాధితులతో టచ్‌లో ఉన్నామని భారత ఎంబసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స అందుతుందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. ఆ నౌకలోని మొత్తం 3700 మందిలో 138 భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం మొత్తంగా ఆ నౌకలోని 170 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ నౌకలోని భారతీయులు తమను కాపాడాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇదిలావుండగా వైరస్ సోకని వారని నౌక నుంచి పంపించే ప్రక్రియ మొదలైంది. శుక్రవారంనాడు 11మందికి నిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. మరోవైపు చైనాలో కరోనాతో 1483మంది చనిపోయారు. శుక్రవారంనాడు ఒక్కరోజే 116మంది రోగులు మరణించినట్లు బీజింగ్ ఆరోగ్య విభాగం ప్రకటించింది. కొత్తగా మూడు వేల కేసులు కోవిడ్19 పాజిటివ్‌గా తేలాయని వెల్లడించారు. ఆరుగురు హెల్త్ వర్కర్లు కూడా వైరస్ సోకి మృత్యువాతపడ్డట్లు తెలిపారు.

We are vigilant on CoVID 19
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News