Monday, April 29, 2024

పశ్చిమ్ బెంగాల్ లో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతితో నేపథ్యంలో ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌, ఆంక్షలు విధించాయి. తాజాగా పశ్చిమ్‌ బెంగాల్‌ లో కూడా 15 రోజుల లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో రేపటి నుంచి మే 30వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, స్కూళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, పబ్స్, జిమ్స్, పరిశ్రమలు, బస్సులు, మెట్రో రైళ్లు వంటి అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. మతపరమైన సమావేశాలతో సహా అన్ని రకాల సమావేశాలపై నిషేధాజ్ఞలు విధించింది. ఇక, పెట్రోల్ పంపులు, నిత్యావసర సరుకులు, మెడికల్ షాపులు, విద్యుత్, ఫైర్ డిపార్ట్ మెంట్స్, మీడియా, ఈ కామర్స్, హోమ్ డెలివరీ సర్వీసులకు మినహాయింపునిచ్చారు.

West Bengal Govt imposes Lockdown till May 30

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News