Friday, April 26, 2024

కోవిడ్-19 సమాచారం తెలుసుకునేందుకు వాట్సాప్ చాట్ బాట్

- Advertisement -
- Advertisement -

WhatsApp ChatBot

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం 9000658658 నెంబర్‌పై ‘టిఎస్ గవర్నమెంట్ కోవిడ్ ఇన్‌ఫో’  పేరిట వాట్సాప్ చాట్ బాట్‌ను సోమవారం మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. కోవిడ్-19పై సమాచారం, నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పౌరులకు తెలియచేసేం దుకు ఈ వాట్సాప్ వేదికను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. కరోనా వైరస్‌పై పోరుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, దీనికోసం అన్ని వేదికలను ఉపయోగించుకుంటున్నామని కెటిఆర్ తెలిపారు.

కరోనా మహామ్మారి ప్రజలకు ప్రామాణికమైన సమాచారం అందించాలన్న లక్షంతో వాట్సాప్ సౌజన్యంతో ఈ నిర్ధిష్టమైన చాట్ బాట్‌ను రూపొందించిందన్నారు. లాక్‌డౌన్‌ను గౌరవిస్తూ ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండాలని అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సమాచారంపై ఆధారపడాలని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ పరిష్కారాల సంస్థ ఎస్‌బి టెక్నాలజీ, వాట్సాప్ అధికారిక వ్యాపార పరిష్కారాల భాగస్వామి మెసెంజర్ పీపుల్‌తో కలిపి తెలంగాణ ఐటి శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ఈ చాట్‌బాట్‌ను నిర్మించాయని ఆయన తెలిపారు.

సందేహాలను ఈ నెంబర్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు: జయేశ్‌రంజన్
ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ మాట్లాడుతూ కోవిడ్ 19కి సంబంధించి పౌరులకు ఏవైనా సందేహాలు ఉంటే ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చన్నారు. చాట్‌బాట్ సంభాషణ ప్రారంభించడానికి 9000658658 నెంబర్‌కి Hi లేదా Hello లేదా కోవిడ్ అని వాట్సాప్‌లో సందేశం పంపించాలని ఆయన సూచిం చారు. https://wa.me/919000658658?text=Hi లింకును తమ మొబైల్ నుంచి క్లిక్ చేయా లని, క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వానికి అందిస్తున్న సహకారానికి ఫేస్‌బుక్, వాట్సా ప్ వారి సాంకేతిక, వ్యాపార భాగస్వాములకు ఆయన ఈ సందర్భంగా ధన్యవా దాలు తెలిపారు. తెలంగాణ వాట్సాప్ చాట్ బాట్‌కు సంబంధించి ఏవైనా సందే హాలు, సూచనలు ఉంటే covid19info-itc@telangana.gov.inకి ఈమెయిల్ చేయాలని ఆయన సూచిం చారు.

 

WhatsApp ChatBot for information on Covid 19
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News