Saturday, April 27, 2024

కొవిడ్ కన్నా ప్రాణాంతకమైన మరో మహమ్మారి

- Advertisement -
- Advertisement -

జెనీవా : కొవిడ్ 19 కంటే ప్రాణాంతకమైన మరో మహమ్మారి పొంచి ఉందని , ఈ పరిస్థితిని ఎదుర్కోడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధినేత టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. 76 వ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదట ప్రాణాంతకంగా మారిన కొవిడ్ తన ఉనికిని వేరియంట్లుగా మార్చుకుంటూ తరువాత నెమ్మదించిందని చెప్పారు. అయినా మనం అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా చేసిందన్నారు. ప్రపంచం మొత్తం మీద ఈ మహమ్మారి 7 మిలియన్ మంది ప్రాణాలు బలిగొంది. ప్రపంచ ఆరోగ్య అత్యవసరం కింద కొవిడ్ 19 అంతమవుతున్నా ప్రపంచ ఆరోగ్య ప్రమాదం మాత్రం తప్పిపోలేదని పేర్కొన్నారు.

వేరే వేరియంట్ రూపంలో కొత్తగా వ్యాధులు పుట్టుకొస్తున్నాయని , మరణాలు ఉంటున్నాయని పేర్కొన్నారు. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్( ఎస్‌డీజీలు) కింద ఆరోగ్య సంబంధిత లక్షాలు 2030 ని మరింతగా అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను ఈ కొవిడ్ మహమ్మారి తెలియజేసిందన్నారు. 2017 లో ప్రపంచ ఆరోగ్య సమావేశంలో ప్రకటించిన ట్రిపుల్ బిలియన్ లక్షాల పురోగతిని కూడా ప్రభావితం చేసిందన్నారు. ఏదేమైనా గత ఏడాది కాలంగా ఈ మహమ్మారి తగ్గుముఖంలోనే ఉందన్నారు. చాలా దేశాలు కొవిడ్ ముందటి పరిస్థితికి వచ్చాయని చెప్పారు. ప్రపంచ సమాజానికి విపరీత నష్టం తెచ్చిందని, వ్యాపారాలు దెబ్బతిన్నాయని, కొన్ని లక్షల మంది పేదరికం లోకి నెట్టబడ్డారని ఆయన ఉదహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News