Saturday, May 4, 2024

పాతబస్తీలో పాకిస్థానీలు ఎవరో చెప్పండి

- Advertisement -
- Advertisement -

సర్జికల్‌స్ట్రైక్ వ్యాఖ్యలపై బిజెపికి అసదుద్దీన్ సవాలు

Who is Pakistanis in old city ask by asaduddin

మన తెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి ఎ న్నికల నేపథ్యంలో బిజెపి, ఎంఐఎం నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సర్జికల్ స్టయిక్స్‌పై ఇరు పార్టీల మధ్య సంవాదం కొనసాగుతోంది. ఎంఐఎం పార్టీ ఒక ఉగ్ర సంస్థ అంటూ బండి సంజయ్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారని అన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్దే తమ అడ్డా పెడతామని చెప్పారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఇక్కడ రోహింగ్యాలు ఉన్నట్లైతే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్థాన్ వాసులే ఎంఐఎంకు ఓటేస్తున్నారని చెప్పారు.

జిహెచ్‌ఎంసి ఎన్నికలలో విజయం సాధించి, మేయర్ పీఠాన్ని దక్కించుకున్న వెంటనే పాతబస్తీపై సర్టికల్ స్ర్టైయిక్స్ చేస్తామని అన్నారు. రోహిం గ్యాలను, పాకిస్థాన్‌లను తరిమితరిమి కొడతామని చెప్పారు. 24 గంటల సమయం ఇస్తున్నాం. బండి సంజయ్ చేసిన సర్టికల్ స్ట్రయిక్స్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటు గా స్పందించారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామంటున్నారని, పాకిస్థాన్ వాళ్లు ఎవరు ఉన్నారో? చెప్పండి? అని ఆయన ప్రశ్నించారు.

బిజెపికి 24 గంటల సమయం ఇస్తున్నాం అని ఆయన అన్నారు. దేశంలో ఉన్న వాళ్లంతా ఇండియన్స్ అని ఆయన అన్నారు. చైనా 970 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. దమ్ముం టే అక్కడికి వెళ్లి అమిత్‌షా సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలి. దేశం నుంచి ముస్లింలను వేరు చేయలేరు. టెర్రరిస్టులు, పాకిస్థాన్ అనే పదాలు లేకుం డా ప్రచారం చేయగలరా? దమ్ముంటే చదువు, అభివృద్ధి గురించి చెప్పి గెలవాలని బిజెపికి అసదుద్దీన్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News