Monday, April 29, 2024

కాంగ్రెస్ ఉండగా మనీ హీస్ట్ సిరీస్ ఎందుకు?

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు

న్యూఢిల్లీ: జార్ఖండ్‌కు చెందిన ఒక కాంగ్రెస్ ఎంపీ కుటుంబానికి చెందిన ఒడిశాలోని డిస్టిలరీలపై ఆదాయం పన్ను శాఖ దాడులు జరిపి దాదాపు రూ. 350 కోట్ల నగదు, మూడు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అవినీతికి సంబంధించి కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం వ్యంగ్యాస్త్రాలను సంధించారు. స్పానిష్‌కు చెందిన హిట్ సిరీస్ మనీ హీస్ట్(ధన దోపిడీ) ఆధారంగా బిజెపి మార్ఫింగ్ చేసిన వీడియోను ప్రధాని మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు.

ఆదాయం పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టల ఫోటోతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫోటోను జతచేస్తూ మార్ఫింగ్ చేసిన ఫోటోను ఆయన షేర్ చేశారు. కాంగ్రెస్ పారీ ఉండగా భారత్‌లో మనీ హీస్ట్ కల్పిత సిరీస్ ఎవరికి కావాలి..గత 70 ఏళ్లుగా..ఇప్పటికీ ధన దోపిడీలలో వారు ప్రసిద్ధులు..అంటూ ఎక్స్‌లో ప్రధాని మోడీ రాసుకొచ్చారు. అంతకుముందు బిజెపి ఒక కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది.

ఒడిశాలోని బౌధ్ డిస్టిలరీస్‌కు చెందిన కార్యాలయాలలో జరిపిన దాడులలో రూ. 353 కోట్ల నగదును ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ వీడియోను బిజెపి విడుదల చేసింది. ఇది కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుకు చెందిన డిస్టిలరీ కంపెనీగా ఆరోపణలు వచ్చాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన మనీ హీస్ట్‌గా వీడియోలో బిజెపి వర్ణించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News