Monday, April 29, 2024

యువతిని జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నిరసన తెలుపుతున్న యువతిని జుట్టు పట్టుకుని బైక్‌పై లాక్కెళ్లిన మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ భూమి 100 ఎకరాలను హైకోర్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని కేటాయించడాన్ని నిరసిస్తూ ఎబివిపి విద్యార్థులు గత కొంత కాలం నుంచి ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న వారిలో ముందుగానే 20మంది ఎబివిపి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.’

అందులో ఉన్న ఝాన్సీ అనే యువతి పోలీసుల నుంచి తప్పించుకుని రోడ్డుపై పరిగెడుతుండగా స్కూటీపై ఆమెను పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్స్ వెనుక కూర్చున్న కానిస్టేబుల్ ఝాన్సీ జుట్టుపట్టుకోవడంతో కిందపడిపోయింది. ఈ సంఘటన యూనివర్సిటీలో ఈ నెల 24వ తేదీన జరిగింది. దీనిపై విమర్శలు రావడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి విచారణకు ఆదేశించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఉన్నతాధికారులు నివేదిక సమర్పించడంతో కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News