Saturday, April 27, 2024

World Cup 2023: కోహ్లీ శతకం.. బంగ్లాపై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

పుణే: ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియం వేదికగా జరుగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని.. 41.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో బంగ్లాపై టీమిండియా 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.

భారత బ్యాట్స్ మెన్లలో విరాట్ కోహ్లీ(103) అజేయ శతకంతో చెలరేగాడు. ఇక ఓపెనర్లు శుభ్ మన్ గిల్(53) అర్థ శతకంతోపాటు రోహిత్ శర్మ(48), కెఎల్ రాహుల్(34 నాటౌట్)లు రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News