Friday, May 17, 2024

World Cup 2023: 43 ఓవర్లలో సౌతాఫ్రికా టార్గెట్ 246 పరుగులు..

- Advertisement -
- Advertisement -

వన్డే ప్రపంచకప్‌ 2023 లీగ్ దశలో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌, సౌతాఫ్రికా జట్టుకు 246 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది. వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్‌ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు విఫలమైనా… లోయరార్డర్‌ బ్యాటర్లు అదరగొట్టారు.

ముఖ్యంగా కెప్టెన్ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌(69 బంతుల్లో 78 నాటౌట్) అజేయ అర్థశతకంతో రాణించి జట్టును ఆదుకోగా.. చివర్లలో ఆర్యన్‌ దత్‌ (9 బంతుల్లో 23 నాటౌట్), వాన్‌ డెర్‌ మెర్వ్‌(19 బంతుల్లో 29)లు ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించారు. దీంతో నెదర్లాండ్స్‌ జట్టు 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగుల సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసొ రబాడాలు తలా రెండు వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News