Sunday, May 12, 2024

‘యాస్’ తుఫాన్ ఎఫెక్ట్: తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు

- Advertisement -
- Advertisement -

Rains expected in Telangana for next 2 days

మనతెలంగాణ/హైదరాబాద్: ‘యాస్’ తుఫాన్ నేపథ్యంలో రెండు రోజుల పాటు బలమైన గాలులు వాయువ్య, పశ్చిమ దిశల నుంచి రాష్ట్రంలోకి వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాయుగుండం తీవ్రమై సోమవారం ఉదయం 05.30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ‘యాస్’ తుఫాన్ ఏర్పడిందని, ఉదయం 8.30 గంటలకు పరదీప్‌కి దక్షిణ ఆగ్నేయ దిశగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి, మరింత తీవ్రతతో బలపడి రాగల 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారి తదుపరి 24 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది.

Yaas Cyclone: Rains in Telangana for next 3 days

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News