Monday, April 29, 2024

హైదరాబాద్ లో జాంబియా యువతికి 14ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హెరాయిన్ సరఫరా చేస్తు పట్టుబడిన జాంబియా దేశానికి చెందిన యువతికి 14 ఏళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇటీవల శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేస్తున్న సమయంలో జాంబియా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మహిళ హ్యాండ్ బ్యాగ్‌తో పాటు సూట్ కేస్ , డాక్యుమెంట్ ఫోల్డర్‌లో డ్రగ్స్ దాచిపెట్టి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ అధికారులకు చిక్కింది. ప్రయాణికురాలిని జాంబియా వాసిగా గుర్తించారు. నిందితురాలి నుంచి రూ.50 కోట్ల విలువైన 8 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అధికారులు యువతిని ఎల్బీనగర్ కోర్టులో హాజరుపరచగా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News