Sunday, May 12, 2024

జొమాటోలో 500 ఉద్యోగాల కోత

- Advertisement -
- Advertisement -

Zomato

న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు కరోనా కష్టాలు తప్పలేదు. ఈ ఫుడ్ డెలివరీ యాప్ దాదాపు 13 శాతం ఉద్యోగులను తొలగించింది. కోవిడ్19 సంక్షోభం వల్ల చేయడానికి పనిలేకపోవడం వీరిని తొలగించాల్సి వచ్చినట్టు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ దీపిందర్ గోయల్ తెలిపారు. ఇప్పటి వరకు 500 మంది ఉద్యోగులను తొలగించినట్టు వెల్లడించారు. కొన్ని నెలలుగా తమ వ్యాపారంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఉద్యోగులను తొలగించామని అన్నారు. భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెడతామని ఆయన తెలిపారు.

Zomato lays off over 500 employees

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News