Sunday, April 28, 2024

బండి సంజయ్‌కు సవాల్ విసిరిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish Challenge To MP Bandi Sanjay

సిద్ధిపేట: దుబ్బాక ఉపఎన్నికల్లో బిజెపి నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అసత్య ప్రచారలో బిజెపి గోబెల్స్ నే మించిపోయిందని మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాకలో అబద్ధాల ప్రచారంతో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కల్వకుర్తిలో ఎప్పుడో జెండా దిమ్మె కూల్చేస్తే.. ఇప్పుడు దుబ్బాకలో కూల్చేసినట్టు తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న జిజెపి నేతను పోలీసులు అరెస్టు చేశారు. దుబ్బాక ప్రజలు వాస్తవాలను గ్రహించాలని ఆయన పేర్కొన్నారు. బిజెపి నేతలు, అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు.

టౌన్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు కాకుండానే రూ.3కోట్లు కమీషన్ తీసుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం బిజెపి వాళ్లు గడ్డి తింటారా..? అని హరీశ్ ప్రశ్నించారు. బిడి కార్మికులకు ఇచ్చే రూ.2వేల పెన్షన్లో కేంద్ర 1600 ఇస్తోందని ప్రచారం చేస్తున్నారు. బిడి కార్మికులకు 16 పైసలు కూడా ఇవ్వడం లేదు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వృద్ధాప్య పింఛన్ రూ.500 ఇస్తున్నారు. కరీంనగర్ నుంచి వచ్చిన బిజెపి కార్పొరేటర్ దుబ్బాకలో అసత్య ప్రచారం చేస్తున్నారు. ”బిడి కార్మికులకు కేంద్ర పెన్షన్ ఇచ్చినట్టు నిరూపిస్తా? నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే బండి సంజయ్ దుబ్బాకలో ముక్కు భూమికి రాస్తారా”? అని కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కి మంత్రి హరీశ్ సవాల్ విసిరారు. దుబ్బాక పాత బస్టాండ్ దగ్గర చర్చకు సిద్ధం కమ్మన్నారు. హూజూర్ నగర్ లో చెప్పిన విషయాలే ఇక్కడ చెబుతున్నారు. అక్కడ బిజెపికి నాలుగో స్థానం వచ్చిందని మంత్రి హరీశ్ ఎద్దేవా చేశారు.

Minister Harish Challenge To MP Bandi Sanjay

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News