Sunday, April 28, 2024

హైదరాబాద్‌ను వదలని వాన

- Advertisement -
- Advertisement -

Heavy rain lashes Hyderabad again

హైదరాబాద్: హైదరాబాద్ ను వర్షం వదలడం లేదు. ఈరోజు, రేపు తెలంగాణలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. గత వారం రోజులుగా నగరాన్ని వాన  వెంటాడుతూనే ఉంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం మళ్లీ వర్షం కురుస్తోంది. చార్మినార్ లో కుండపోత వర్షం పడుతోంది. మల్కాజ్ గిరి, నాచారం, ముషీరాబాద్, కాప్రా, తార్నాక, ఉస్మానియా వర్సిటీ, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, చార్మినార్, సుల్తాన్ బజార్, కోఠి, ఖైరతాబాద్, పంజాగుట్ట, గచ్చిబౌలి, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కీసర, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, ఉప్పుగూడ, శివాజీనగర్ భారీగా వర్షం కరిసింది. ఇప్పటికీ వందకు పైగా కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ వర్షం ధాటికి పురానాపూల్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. దీంతో వాహనాల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. అయితే ఇప్పటికే ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

Heavy rain lashes Hyderabad again

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News