Monday, April 29, 2024

ముస్లింలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు

- Advertisement -
- Advertisement -

ముఖ్య అతిథిగా హాజరైన సిఎం రేవంత్
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత మాది అని వ్యాఖ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుకు ఇచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేన్లు రద్దు చేస్తామని మోడీ, అమిత్ షా అంటున్నారని, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ, అమిత్ షా వల్ల కాదు అన్నారు.

ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు జరిగేలా చూసే బాధ్యత మాది అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. మైనారిటీ స్కూళ్లకు, రెసిడెన్షియల్స్ భవనాల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందన్నారు. అన్ని రంగాల్లో ముస్లిం మైనారిటీలకు సముచిత స్థానం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు పండుగ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంఐఎం నేతలు అసుదుద్దీన్ ఓవైసి సహా పలువురు ముస్లిం ఇఫ్తార్ విందులో
పాల్గొన్నారు.

Revanth Gift

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News