Monday, April 29, 2024

సింగరేణి ఎన్నికలను వాయిదా వేసిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సింగరేణి ఎన్నికలను హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 27కు సింగరేణి ఎన్నికలు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. నవంబర్ 30వ తేదీలోపు ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని స్పష్టం చేసింది. ఈ నెల 28న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మికశాఖ సిద్ధమైంది. అయితే ఇందుకు సింగరేణి యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సముఖంగా లేదు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికలను నిర్వహించాల్సిందేనంటూ సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ వేసింది సింగరేణి యాజమాన్యం. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది.

దీనిపై బుధవారం విచారించిన డివిజన్ బెంచ్ ధర్మాసనం సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది. ఫలితంగా సింగరేణి ఎన్నికలు వాయిదా పడినట్లయింది. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణపై మొదటి నుంచి కూడా సింగరేణి యాజమాన్యం ఆసక్తి చూపలేదు. ఏదో కారణంతో వాయిదా వేసే ప్రయత్నం చేస్తోంది. చివరికి హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకే కేంద్ర కార్మిక శాఖ ఎన్నికల నిర్వహించేందుకు షెడ్యూల్ రిలీజ్ చేసినప్పటికీ యాజమాన్యం అప్పీల్‌కు వెళ్లింది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావటంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించలేమని గడువు కావాలంటూ హైకోర్టును కోరింది.

మరోవైపు కేంద్ర కార్మికశాఖ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 6,7 తేదీల్లో సంఘాల నుంచి నామినేషన్లను కూడా స్వీకరించింది. కార్మిక సంఘాలకు ఎన్నికల గుర్తులను కేటాయించే పనిలో ఉండటంతో పాటు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోహైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు రావటంతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోనుంది. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోపు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News