Sunday, April 28, 2024

అయోధ్యకు రేపు 100 ప్రైవేట్ విమానాల రాకపోకలు!

- Advertisement -
- Advertisement -

అయోధ్య రామమందిరంలో సోమవారం జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి విఐపీలంతా క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుకున్న ఎనిమిదివేల మందికి పైగా ప్రముఖులు సోమవారం ఉదయానికి అయోధ్యకు చేరుకోనున్నారు. వీరంతా ప్రైవేట్ జెట్ విమానాల్లో అయోధ్యకు రానుండటంతో విమానాశ్రయం కిక్కిరిసిపోయేలా ఉంది. ఒక్క సోమవారంనాడే అయోధ్యకు వంద ప్రైవేట్ విమానాలు వస్తాయని అంచనా.

విమానాశ్రయంలో ల్యాండింగ్ సమస్య ఎదురవుతుందనే ఉద్దేశంతో మరికొందరు వారణాసి, గోరఖ్ పూర్ విమానాశ్రయాల్లో దిగి, అక్కడినుంచి రోడ్డు మార్గంలో అయోధ్యకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఫాల్కన్-2000 విమానంలో తొమ్మిదిమంది ముంబయినుంచి గోరఖ్ పూర్ వెళ్లేందుకు విమానాల బుకింగ్ వెబ్ సైట్… జెట్ సెట్ గో రూ. 74వేలు వసూలు చేస్తోంది.

రాములవారి బంగారు విగ్రహాలకు భలే డిమాండ్

అయోధ్యలో జుయలరీ షాపులకు డిమాండ్ పెరిగిపోయింది. అయోధ్య ఆలయం, రాములవారి విగ్రహం నమూనాలతో తయారు చేసిన బంగారు పళ్లేలనూ, ఉంగరాలనూ భక్తులు విరివిగా కొంటున్నారు. వీటి ధర రూ. 30 వేల నుంచి, రూ.2,20,000 వరకూ ఉంది. స్టాక్ అయిపోవడంతో వ్యాపారులు రెండువారాల్లో తయారు చేసి ఇస్తామని చెప్పి అడ్వాన్స్ తీసుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News