Monday, April 29, 2024

చైనాలో వంద మిలియన్ల కోవిడ్ కేసులు, మిలియన్ కోవిడ్ మరణాలు?!

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు సంక్రమణాలు 100 మిలియన్లకు చేరుకోగలదని, మిలియన్ మరణాలు సంభవించొచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ‘లెక్కల ఆధారంగా చైనాలో దాదాపు 100 మిలియన్ కోవిడ్ కేసులు, ఐదు మిలియన్ల చేరికలు, ఒక మిలియన్ మరణాలు ఉండొచ్చని మేము అంచనావేస్తున్నాము’ అని ఢిల్లీలోని సఫ్ధర్‌జంగ్ ఆసుపత్రిలో పల్మనరీ మెడిసిన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ నీరజ్ కుమార్ గుప్తా శనివారం తెలిపారు. ప్రస్తుతానికి అయితే 50 మిలియన్ కేసులు దాటింది.

ఇదివరలో భారత్ ఎదుర్కొన్న దశనే ఇప్పుడు చైనా ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. వైరస్‌తో పోరాడే అనుభవం భారత్‌కు ఉందన్నారు. “మేము మొదటి వేవ్, డేల్టా వేరియంట్‌తో రెండో వేవ్, ఓమిక్రాన్ వేరియంట్‌తో మూడో వేవ్‌ను ఎదుర్కొన్నాం. చైనా కఠినమైన లాక్‌డౌన్ అవలంబించినందున చైనా పౌరులకు తక్కువ రోగ నిరోధక శక్తి ఉంది” అని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News