Wednesday, May 1, 2024

భవనం కూలిన ఘటనలో 11కి పెరిగిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

11 died after collapsed building in Maharashtra

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఐదు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య మంగళవారం 11కు పెరిగింది. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు పురుషులు, ఐదుగురు మహిళలను ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సజీవంగా రక్షించినట్లు వారు తెలిపారు. ముంబయికి 170 కిలోమీటర్ల దూరంలోని మహద్ పట్టణానికి చెందిన కజల్‌పురా ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటనలో ఒక నాలుగేళ్ల చిన్నారిని కూడా సహాయక సిబ్బంది భవన శిథిలాల కింద నుంచి రక్షించారు. భవన శిథిలాల కింద మరో 17 మంది చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నట్లు ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారి అలోక్ కుమార్ చెప్పారు. శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన మహమ్మద్ బంగి అనే నాలుగేళ్ల బాలుడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ బాలుడితోపాటు అతని ఇద్దరు అక్కలు, తల్లి శిథిలాల కిందే ఉన్నారని ఆ బాలుడి బంధువు రూపస తెలిపారు.

అయితే, శిథిలాల నుంచి ఆ బాలుడి తల్లి 30 ఏళ్ల నౌషిన్ మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. పదేళ్ల క్రితం నిర్మించిన ఈ ఐదు అంతస్తుల భవనంలో మొత్తం 40 ఫ్లాట్‌లు ఉన్నాయని, అందులో 95 మంది నివసిస్తున్నారని రాయగడ్ ఎస్‌పి అనిల్ పరస్కర్ తెలిపారు. అదృష్టవశాత్తు భవనం కూలిపోవడానికి కొద్ది క్షణాల ముందే అందులోని 75 మంది బయటపడ్డారని ఆయన చెప్పారు. బిల్డర్‌తోపాటు కాంట్రాక్టర్, ఇంజనీర్, ఆర్కిటెక్ట్, భవన కన్సల్టెంట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం విచారం వ్యక్తం చేశారు.

11 died after collapsed building in Maharashtra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News