Monday, April 29, 2024

మావోయిస్టుల ఘాతుకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/దంతేవాడ/ భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ లో బుధవారం నక్సల్స్ పంజావిసిరారు. జిల్లాలోని అరవ్‌పూర్ గ్రామ సమీపంలో మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతరను పేల్చిన ఘటనలో మొత్తం 11 మంది దుర్మరణం చెందారు. మృతులలో పది మంది పోలీసు లు , ఓ డ్రైవర్ ఉన్నారు. దాడిలో పలువురు పోలీసు జవాన్లకు తీవ్రగాయాలు అయ్యాయి. రాష్ట్ర పోలీసు విభాగానికి అనుంబం ధం అయిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ దళం మధ్యాహ్నం ఒంటిగం ట ప్రాంతంలో ఇక్కడి నుంచి నక్సల్స్ అణచివేత చర్యలలో భా గంగా అద్దెకు తీసుకున్న వ్యాన్‌లో గస్తీకి ఉదయం పూట వెళ్లి తిరిగి మధ్యాహ్నం భోజన సమయానికి తమ స్థావరానికి నవెళ్లుతుండగా నక్సల్స్ గురి చూసి ఐఇడి పేలుడుకు దిగారు. ఈ ఘటన అరన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిందని బ స్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు పి సుందర్రాజ్ విలేకరులకు తెలిపారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతకు ఉ పయుక్తంగా ఉండేందుకు వీలుగా ఈ ప్రాంతంలోని గిరిజన యువకులను ఎంచుకునే , వారికి తగు పోరాట శిక్షణ ఇచ్చి ఈ దళంలో చేర్చినట్లు, ఈ ప్రాంతపు వెన్నుదన్నులు బా గాతెలిసిన వారు కావడంతో మావోయిస్టుల కదలికల గురిం చి బాగా తెలిసి ఉంటుందనే ఆలోచనలతోనే ఈ డిఆర్‌జి బలగాలను ఇక్కడ గాలింపు చర్యలకు దింపినట్లు వెల్లడైంది.

రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు నక్సల్స్ పేలుడు జరిగిన ప్రాంతం 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలుడు తీవ్రతకు ఘటనాస్థలిలో పది అడుగుల లోతైన గుంత ఏర్పడింది. పోలీసు దళం వాడిన వాహనం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ దృశ్యాలతో కూడిన వీడియో పలు ఛా నళ్లలో ప్రసారం అయింది. కొందరు పోలీసుల భౌతికకాయా లు తెగిపడి ఉన్నట్లు కన్పించింది. దర్భా డివిజన్‌లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయనే కీలక సమాచారం అం దడంతో ఇక్కడికి ఈ పోలీసు బలగాలు వాహనంలో బయలు దేరాయని ఐజిపి తెలిపారు. ఈ దారిలోనే నక్సల్స్ న పేలుడు పదార్థం అమర్చిపెట్టినట్లు వెల్లడైంది. విధుల నిర్వహణలో భాగంగా వీరు దంతేవాడ జిల్లా పోలీసు ప్రధాన కా ర్యాలయం నుంచి ముందుకు వెళ్లుతున్న దశలోనే పేలుడు జరిగింది. వీరి మినీ గూడ్స్ వ్యాన్‌ను నక్సల్స్ అరన్‌పూర్ సమేలీ గ్రామాల మధ్య పేల్చివేసినట్లు ఐజి చెప్పారు. ఈ క్రమంలోనే పది మంది డిఆర్‌జి జవాన్లు, వ్యాన్ డ్రైవర్ మృతి చెందినట్లు నిర్థారణ అయింది. సమాచారం తెలియగానే ఈ ప్రాం తానికి అదనపు భద్రతా బలగాలను తరలించారు. మృతదేహాలను అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు జరిగాయి.

ఈ ప్రాం తంలో భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా అడవులు తరచూ నక్సల్స్ దాడులకు నిలయంగా మారుతూ వచ్చాయి. దంతేవాడ సహా ఏడు జిల్లాలు బస్తర్ ప్రాంతంలోకి వస్తాయి. వీటిని నక్సల్స్ ప్రాబల్య ప్రాం తాలుగా గుర్తించారు. సాధారణంగా వేసవికాలంలోనే నక్సల్స్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ దాడులకు దిగుతున్నారు. ఇప్పుడు బుధవారం జరిగిన పేలుడు ఘటన గత రెండేళ్లలో తీవ్రస్థాయి ఘటనగా మారింది. పోలీసు బృందాలను ఏదో విధంగా ఈ ప్రాంతానికి గాలింపు చర్యల కోసం రప్పించి దెబ్బతీయడం వీరి ఎదురుదెబ్బల వ్యూహంలో భాగమైంది. గత ఏడాది మార్చి నుంచి జూన్ వరకూ పలు నక్సల్స్ దాడులు జరిగాయి. ఇంతకు ముందు 2021 ఎప్రిల్ 3వ తేదీన జరిగిన భారీ ఘటనలో 22 మంది భద్రతా సిబ్బంది నక్సల్స్ దాడిలో మృతి చెందారు.

సుక్మా, బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది. అంతకు ముందు 2020 మార్చి 21వ తేదీన మిన్పా ప్రాంతంలో జరిగిన ఘటనలో 17 మంది జవాన్లు మృతి చెందారు.2019లో ఎప్రిల్ 9న దంతేవాడ జిల్లాలోనే వీరి దాడిలో బిజెపి ఎమ్మెల్యే భీమా మాండవీ, నలుగురు ఆయన భద్రతా సిబ్బంది హతులయ్యారు. 2017 లో సుక్మా జిల్లాలో బుర్కాపాల్ వద్ద జరిగిన దాడిలో పాతిక మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది ప్రాణాలు పోవడం నక్సల్స్ దా డుల తీవ్రతకు అద్దం పట్టింది. ఇక అన్నింటికి మించి భయానకంగా తడమెట్ల వద్ద ఊచకోత వంటి ఘటన జరిగింది. అక్కడ 2010 ఎప్రిల్ 6వ తేదీన నక్సల్స్ జరిపిన దాడిలో 76 మంది జవాన్లు చనిపోయారు. ఈ మధ్యకాలంలో నక్సల్స్ ఏరివేతలు పెరుగుతూ ఉండటంతో చర్యలు సద్దుమణిగాయి. కానీ ఇప్పు డు ఈ బుధవారం ఘటన కలకలం రేపింది. ఈ దాడి జరిగిన చోట చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఆయుధాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. గాయపడ్డ వారిని రాయ్‌పూర్ ఆసుపత్రులకు చికిత్సకు పంపించారు. గత వారం రోజుల క్రితమే నక్సల్స్ ఈ ప్రాంతంలో వెలువరించిన పోస్టర్లలో గాలింపు చర్యలకు దిగే పోలీసు భద్రతా బలగాలనే లేపేస్తామని హెచ్చరించారు. అనుకున్నంత పనిచేశారు.

మృతులంతా స్థానిక ఆదివాసీలే !

హెడ్‌కానిస్టేబుల్ జోగా సోధి, మున్నారామ్ కడ్తి, సంతోష్ త మో,కానిస్టేబుల్ దుల్గో మాండవి, క్షుమార్కం, జోగా కవా సి, హరిరామ్ మాండవి, జవాన్లు రాజురామ్ కర్తమ్ , జైరాం పొడి యం, జగదీష్ కవాసి ఉన్నారు. బలైన డ్రైవర్ ధనిరామ్ యాద వ్ అని వెల్లడైంది. భౌతిక కాయాలను వెంటనే వారివారి గ్రా మాలకు బంధువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు జరిగాయి.

నక్సల్స్‌ను ఏరివేస్తాం : సిఎం భఘేల్

దంతేవాడలో నక్సల్స్ దాడి ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి భూ పేష్ భఘేల్ తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో నక్సల్స్ ఏరివేత కార్యక్రమం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుందని, అన్ని వైపుల నుంచి దిగ్బంధానికి దిగడంతోనే నిస్పృహతోనే వీరు ఈ తెగింపునకు దిగారని సిఎం తెలిపారు. నక్సల్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఘటనను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. మృతులకు నివాళులు అర్పిస్తున్న ట్లు ప్రకటన వెలువరించారు. ఈ అమరవీరుల త్యాగాలను జా తి మరవబోదని స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగా ఢ సానుభూతి అని తెలిపారు. ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోన్ లో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

50 కిలోల పేలుడు పదార్థంతో భారీ పేలుడు

గాలింపు చర్యలకు పోలీసు దళం వస్తున్నదనే సమాచారం అందడంతో మావోయిస్టులు దంతేవాడ ప్రాంతంలో ఇప్పుడు 50 కిలోల వరకూ పేలుడు పదార్థం ధట్టించిన పరికరాన్ని పేల్చినట్లు వెల్లడైంది. దీనిని ఐఇడిగా పిలుస్తున్నారు. బాంబుగానే దీనిని రూపొందించి పేల్చినట్లు గుర్తించారు. వ్యాన్‌ను లక్షంగా చేసుకుని నక్సల్స్ సాధారణం కన్నా పదిరెట్లు తీవ్రతతో ఉండే పేలుడు పదార్థపు ఐఇడితో దాడికి దిగారు. ఇది చాలా తీవ్రస్థాయి పేలుడు పదార్థంగా ఉందని ప్రాంతీయ సైనిక విభాగం మాజీ అధినేత మేజర్ జనరల్ అశ్వినీ సివాచ్ తెలిపారు. ఘటన తరువాత మావోయిస్టులు దట్టమైన అడవుల్లోకి వెళ్లారు. ఘటన జరిగిన ప్రాంతం మూడు రాష్ట్రాల త్రికూడలిలో ఉంది. ఈ ప్రాంతంలో భారీ స్థాయి నక్సల్స్ ఏరివేత చర్యలను దెబ్బతీసేందుకు మావోయిస్టులు ఇప్పుడు పెద్ద ఎత్తున దాడికి వ్యూహం పన్నినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News