Thursday, May 9, 2024

నాలుగు అడుగుల దూరంలో ఎలుగుబంటి…. బాలుడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే….

- Advertisement -
- Advertisement -

12-year-old boy escape from bear

రోమ్: 12 ఏళ్ల బాలుడు పెద్ద ఎలుగు బంటి నుంచి తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇటలీ కి చెందిన అలెస్‌సండ్రో అనే బాలుడు తన బంధువులో కలిసి పిక్నిక్‌కు వెళ్లాడు. పర్వతంపైన బాలుడి వెనుక బాగంలో నాలుగు అడుగుల దూరంలో ఎలుగుబంటి ఉంది. ఎలుగుబంటి కనిపించగానే ఆందోళన చెందకుండా ముందుకు నెమ్మదిగా కిందకు నడుచుకుంటూ వచ్చాడు. అంత దగ్గరగా ఎలుగుబంటి ఉన్న ఏ మాత్రం భయపడకుండా బాలుడు నడిచి వచ్చిన తీరుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ట్విట్టర్‌లో ఈ వీడియోను దాదాపుగా 1.10 లక్షల మంది వీక్షించారు. మిస్టర్ కూల్ కు మారుపేరుగా బాలుడి నిలిచాడని అడమ్ అగస్టీన్ అనే నెటిజన్ కొనియాడారు. ఆ బాలుడి ధైర్యానికి టన్నుల కొద్దిగా దీవించాలని ఉందని సార్వేష్ అనే నెటిజన్ ప్రశంసించారు. ఓ మై గాడ్ బాలుడి ధైర్యానికి సలాం కొట్టాల్సిందేనని గ్రిజ్లీ అనే నెటిజిన్ మెచ్చుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News