Saturday, April 27, 2024

తెలంగాణలో 1,217 కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

1217 new covid cases reported in telangana

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. తెలంగాణలో 1,217 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 48,434 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా,,1217 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,77,530కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,100కు చేరింది. తాజాగా కరోనా నుంచి 3,944 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,46,932 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.06 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.53 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,498 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 1,325 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News