Saturday, April 27, 2024

రాష్ట్రంలో కొత్త కేసులు 1430.. ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

1430 New Corona Cases Reported in Telangana

జిహెచ్‌ఎంసిలో 703, జిల్లాల్లో 727 మందికి వైరస్
47,705కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 16,855 టెస్టులు చేయగా, 1430 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 703 మంది ఉండగా, రంగారెడ్డిలో 117, మేడ్చల్ 105, సంగారెడ్డి 50, ఖమ్మం14, కామారెడ్డి 43, వరంగల్ అర్బన్ 34, వరంగల్ రూరల్ 20, నిర్మల్ 1, కరీంనగర్ 27, జగిత్యాల 18, యాదాద్రి 9,మహబూబాబాద్ 27, పెద్దపల్లి 4, మెదక్ 26, మహబూబ్‌నగర్ 6, మంచిర్యాల 5,భద్రాది 5, భూపాలపల్లి 27, నల్గొండ 45, సిరిసిల్లా 8, ఆదిలాబాద్ 7, వికారాబాద్ 9, నాగర్‌కర్నూల్ 18, జనగాం 9,నిజామాబాద్ 48, సిద్ధిపేట్ 14, సూర్యాపేట్ 27, గద్వాల్లో మరో నలుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అదే విధంగా వైరస్ దాడిలో మరో ఏడుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 47,705కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 36,385కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 10,891 మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 429కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు.

కోవిడ్ సమాచారం..
కరోనాకు చికిత్సను అందిస్తున్న ప్రభుత్వ హాస్పిటల్స్    61
ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ సంఖ్య                     57
బెడ్ల సంఖ్య                                              17048
ఐసియూ బెడ్లు                                          1616
వెంటిలేటర్ పరుపులు                                   471
ప్రభుత్వ ఆదీనంలో టెస్టులు చేస్తున్న ల్యాబ్‌లు          16
ప్రైవేట్, కార్పొరేట్ ల్యాబ్‌ల సంఖ్య                        23

1430 New Corona Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News