Monday, April 29, 2024

మహారాష్ట్రలో 19 జెఎన్.1 కరోనా వేరియంట్ కేసులు

- Advertisement -
- Advertisement -

ముంబయి : కరోనా జెఎన్.1 వేరియంట్ కొత్త కేసులు 19 కనుగొన్నట్లు మహారాష్ట్ర వెల్లడించింది. జెఎన్.1 వేరియంట్‌కు సంబంధించి అత్యధిక కేసులు పుణెలో నమోదయ్యాయి. శనివారం వరకు మహారాష్ట్రలో ఓమిక్రాన్‌కు చెందిన జెఎన్.1 సబ్ వేరియంట్ కేసులు పది బయటపడ్డాయి. ఠాణె, పుణె, అకోలా నగరాలలో, పుణె, సింధుదుర్గ్ జిల్లాల్లో వైరస్ కేసులు కనుగొన్నారు. రాష్ట్రంలో 19 కొత్త కేసులతో కొత్త వేరియంట్‌కు సంబంధించి మొత్తం కేసుల సంఖ్య 29కి పెరిగాయి. కాగా, దేశంలో ఆదివారం 841 కొత్త కొవిడ్ 19 కేసులు నమోదు అయ్యాయని, గడచిన ఏడు నెలల్లో అత్యధిక స్థాయిలో రోజువారీ కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News