Saturday, April 27, 2024

ఐసీయూలో రోగిని ఎలుకలు కరిచిన ఘటన.. ఇద్దరు డాక్టర్లపై వేటు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో రోగిని ఎలుకలు కరిచిన ఘటనపై ఇద్దరు డాక్టర్లపై వేటు పడింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి ఐసియూలో చికిత్స పొందుతున్న షేక్ ముజీబ్ చేతిని ఎలుకలు కరిచి గాయపర్చాయి. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నారు. ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉండటంతో ఐసీయూలోనూ ఎలుకలు తిరుగుతున్నాయని రోగులు, సహాయకులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై సీరియస్ అయిన అధికారులు.. ఇధ్దరు వైద్యులు కావ్య, వసంత్ కుమార్ తోపాటు స్టాఫ్ నర్స్ మంజులను సస్పెన్షన్ చేసింది. దీనిపై, తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో ఎలుకలు ఉండకుండా చూడాల్సిన భాద్యత శానిటేషన్ సిబ్బంది, సంబంధించిన అధికారుల విషయమైతే డాక్టర్లను సస్పెండ్ చేయడం ఏంటని మండిపడ్డారు. 24 గంటల్లో సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రాష్ట్రంలో ఉన్న టీచింగ్ డాక్టర్లు అంతా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News