Friday, May 3, 2024

తెలంగాణలో కొత్తగా 293 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

293 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 293 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ తో మరో ఇద్దరు మృతి చెందారు. అదే సమయంలో మరో 535 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,108కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 1,546 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,79,991 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,571 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో 3,418 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ పరిధిలో కొత్తగా 72 కరోనా కేసులు బయటపడ్డాయని రాష్ట్ర వైద్యఆరోగ్య అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News