Monday, April 29, 2024

డిమాండ్ ఉన్న ప్రాంతాలకు 330 అదనపు రైళ్లు

- Advertisement -
- Advertisement -

330 additional Trains to areas of demand

 

న్యూఢిల్లీ: అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఏప్రిల్‌మే మధ్యకాలంలో అదనంగా 330 రైళ్లు ద్వారా 674 ట్రిప్పులు నడపనున్నట్టు రైల్వేబోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ ఆదివారం వెల్లడించారు. గోరఖ్‌పూర్, పాట్నా, ముజఫర్‌నగర్, వారణాసి, గువాహతి, అలహాబాద్, బొకారో,తదితర ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటోందని, అక్కడ ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి అదనపు రైళ్లు నడుపుతామని చెప్పారు. కరోనా కారణంగా ప్రయాణికుల రద్దీ అంతగా లేకున్నా వలసకార్మికులు తమ స్వంత రాష్ట్రాలకు తరలి వెళ్తుండడంతో రద్దీ ఎక్కువైందని తెలిపారు. ప్రస్తుతం సరాసరిన రోజుకు 1514 స్పెషల్ రైళ్లు, 5387 సబర్బన్ సర్వీసులు నడుపుతున్నారు. ఇప్పుడు అదనంగా 330 రైళ్ల ద్వారా నడపనున్న 674 ట్రిప్పుల్లో సెంట్రల్ రైల్వే 143 రైళ్లు(377 ట్రిప్పులు), పశ్చిమ రైల్వే 154 రైళ్లు (212 ట్రిప్పులు), ఉత్తర రైల్వే 27 రైళ్లు (27 ట్రిప్పులు), ఈస్ట్‌సెంట్రల్ రైల్వే 2 రైళ్లు (4 ట్రిప్పులు), నార్త్ ఈస్టర్న్ రైల్వే9 రైళ్లు (14 ట్రిప్పులు ), నార్త్ సెంట్రల్ రైల్వే1 రైలు (10 ట్రిప్పులు ),సౌత్ వెస్టర్న్ రైల్వే 3 రైళ్లు, (30 ట్రిప్పులు) నడపనున్నాయి. అదనపు రైళ్లు 330 లో ముంబై ఏరియా నుంచి 101, ఢిల్లీ ఏరియా నుంచి 21 నడుస్తాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News