Monday, April 29, 2024

సాగర్ ఉపపోరు @ 41

- Advertisement -
- Advertisement -

ముగిసిన నామిపత్రాల ఉపసంహరణ ప్రక్రియ
ఉపసంహరించుకున్న 19మంది అభ్యర్ధులు
రంగంలో 41మంది ప్రధాన పార్టీ, స్వతంత్రులు
ఇక మరింత ముమ్మరంగా ఉపఎన్నికల ప్రచారం

మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబందించి నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసింది. నామినేషన్‌ల తిరస్కరణ, ఉపసంహరణ ప్రక్రియలు ముగిసిన తర్వాత ఎన్నికల రణరంగంలో 41మంది అభ్యర్ధులు నిలిచా రు. ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా శుక్ర, శనివారాలు రెండు రోజులు కలిపి 19మంది తమ నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. సాగర్ ఉపపోరు ను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించిన నేపధ్య ంలో మొత్తంగా 72మంది అభ్యర్ధులు నామినేషన్‌లు దాఖలు చేయగా అందులో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు కూడా ఉండడం విశేషం.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోరుకు ఎన్నికల సంఘం నామినేషన్‌లకు ఆహ్వానించగా ప్ర తిష్టాత్మకమైన ఈ ఉపపోరులో పెద్ద ఎత్తున నామినేషన్‌లు దాఖలయ్యాయి.

మొత్తంగా 72మంది తమ నా మపత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించ గా ఆ మరుసటిరోజునే జరిగిన పరిశీలన క్రతువులో 17మంది అభ్యర్ధుల నామినేషన్‌లు తిరస్కరించబడ్డా యి. ప్రధానంగా బిజెపి నాగార్జునసాగర్ నియోజకవ ర్గ ఇన్‌చార్జ్ నివేదితారెడ్డి, ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్ది కు తుబుద్దీన్‌ల పత్రాలు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. ఆ తర్వాతి ప్రక్రియలో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు నామపత్రాలు ఉపసంహరించుకునేందుకు ఎన్నికల సంఘం అవకా శం కల్పించింది. ఏప్రిల్ నెల మొదటి మూడు రోజుల ఉపసంహరణ గడువులో భాగంగా మొదటిరోజు ఎవ రు స్పందించకపోయినా రెండవ రోజు ముగ్గురు త మ పత్రాలు వెనక్కి తీసుకోగా, మూడో రోజైన శనివారం నాడు 16మంది ఉపసంహరించుకోగా మొ త్తంగా 19మంది నామినేషన్‌లు వెనక్కితీసుకున్నారు.

దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల రణరంగంలో 41మంది ప్రధాన రాజకీయ పార్టీలు, స్వతంత్రులు, రిజిష్టర్ పార్టీల అభ్యర్ధులు పోరాడబోతున్నారు. ఇం దులో ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్దిగా దివంగత నేత నోముల నర్సింహ్మ య్య రాజకీయ వారసుడు నోముల భగత్, ప్రధాన ప్ర తిపక్షం అభ్యర్దిగా కుందూరుజానారెడ్డి, భారతీయ జనతా పార్టీ అభ్యర్దిగా రవికుమార్ నాయక్‌లు ఉపపో రు బరిలో నిలిచారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి, టి డిపి పార్టీల అభ్యర్ధుల నామినేషన్‌లకు ఎన్నికల సం ఘం ఆమోదముద్ర పడడంతో సాగర్ ఉప ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొననుంది. ఇదిలా ఉండగా సాగర్ ఉప ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టిసారించింది. ఎన్నికల నిర్వహణతీరు పట్ల జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ జీవన్‌పాటిల్, డిఐజి రంగనాధ్‌లు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నిశిత దృష్టిసారించారు. ఎన్నికల నిర్వహణతో పాటు భద్రతా ఏర్పాట్లు విషయంలో వీరిద్దరు ఎప్పటికప్పుడు సమీక్షల మీద సమీక్షలతో పగడ్బందీ ఏర్పాట్లతో తలమునకలు కాగా నియోజకవర్గంలో మకాం వేసిన కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు అన్ని ప్రా ంతాల్లో అనువణువున అన్వేషణ కొనసాగిస్తున్నారు.

మద్యం, నగదు పంపిణీ విషయంలో ప్రత్యేక నిఘా కొనసాగుతున్న నేపధ్యంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కాగా ఉప ఎన్నికల పరిశీలకుని గా ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాహుల్‌సింగ్ గత నెల 29వ తేదీన కొవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ కాగా ఆయన స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం సజ్జన్‌సింగ్ ఆర్ చ వాన్‌ను పరిశీలకునిగా నియమించింది ఎన్నికల సం ఘం. కాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నామినేషన్‌ల ఉపసంహరణ ప్రక్రియ సైతం ముగియడంతో ఇక ఎన్నికల పోరు రణరంగంగా మారనున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరంగా కొనసాగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News