Monday, April 29, 2024

24 వేలు దాటిన క్రియాశీల కేసులు

- Advertisement -
- Advertisement -

4270 new covid cases reported in india

న్యూఢిల్లీ : రోజువారీ కరోనా కేసులు 4 వేలకు పైగానే నమోదవుతున్నాయి. మరోవైపు క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,13, 699 పరీక్షలు చేయగా, కొత్తగా 4270 కేసులు వెలుగు లోకి వచ్చాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.03 శాతానికి పెరిగింది. కొత్త కేసుల్లో మహారాష్ట్ర నుంచే 1300 కు పైగా కేసులు ఉన్నాయి. శనివారం కొవిడ్‌తో చికిత్స పొందుతూ 15 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,692 కు చేరింది. శనివారం 2619 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 4.26 కోట్లు దాటింది. ఆ రేటు 98.73 శాతంగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉంటుండటంతో క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతూ 24 వేలు దాటాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 24,052 ( 0.06 శాతం) యాక్టివ్ కేసులు ఉన్నాయి. వ్యాక్సినేషన్‌కు సంబంధించి శనివారం 11,92,427 మంది టీకాలు వేయించుకోగా, ఇప్పటికి పంపిణీ అయిన డోసుల సంఖ్య 194 కోట్లు దాటింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News